
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వనపర్తి (మహబూబ్‌నగర్): పొలం తగాదా విషయంలో ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే వనపర్తి పురపాలిక పరిధిలోని నాగవరానికి చెందిన లక్ష్మి, ఆమె కుమారుడు ఆంజనేయులు ఓ పొలం తగాదాకు సంబంధించి చిమనగుంటపల్లికి చెందిన జబ్బు చిన్ననారాయణ, జబ్బు పెద్ద నారాయణ, రవి, పవన్‌పై వేర్వేరుగా వనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
తీరా విచారణలో చిన్ననారాయణ 2015లో చనిపోయినట్లు తేలింది. అలాగే పెద్ద నారాయణ అనారోగ్యంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. దీనిపై ఎస్‌ఐ షేక్‌షఫీను వివరణ కోరగా.. లక్ష్మి ఫిర్యాదు మేరకు నలుగురిపై ఎఫ్‌ఐఆర్ చేశామన్నారు. తమ విచారణలో జబ్బు చిన్న నారాయణ గతంలోనే చనిపోయాడని గుర్తించాం. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనేది తదుపరి దర్యాప్తులో తేలుతుందన్నారు.