రుక్మవ్వ (ఫైల్)
సాక్షి, బోధన్,(నిజామాబాద్): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాతృమూర్తి రుక్మవ్వ (95) ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మంత్రి సోదరుడు సురేందర్‌రెడ్డి స్వగృహంలో కన్నుమూశారు. సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మాజీ మంత్రి పీఎస్‌ఆర్ మాతృమూర్తి మృతి పట్ల ఆ పార్టీ నియోజక వర్గం, మండల నాయకులు పాషామోహినోద్దీన్, అబ్బగోని గంగాధర్ గౌడ్, దామోదర్ రెడ్డి పలువురు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.
నిరుపేద స్నేహితుడి కుమార్తె పేరిట రూ.20 వేల డిపాజిట్
భిక్కనూరు: స్నేహితుల దినోత్సవం రోజు వారు తమ మిత్రుడికి అండగా నిలిచారు. భిక్కనూరుకు చెందిన అక్కల సంతోష్ ఇల్లు ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సంతోష్ సరస్వతి శిశు మందిర్‌లో చదువుకున్నాడు. ఆయన ఇల్లు కాలిపోయిన విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం చేయూత అందించారు. సంతోష్ కుమార్తె పేరిట రూ.20 వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ బాండును అందజేశారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు దుస్తులు అందజేశారు. అలాగే కుమార్తె పెళ్లి కోసం బెంగ పెట్టుకోవద్దని సంపూర్ణంగా ఆదుకుంటామని తమ బాల్య మిత్రుడు సంతోష్‌కు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment