మద్ది విద్యాసాగర్ రెడ్డి (ఫైల్)
సాక్షి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మద్ది విద్యాసాగర్‌రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1981లో కౌన్సిలర్‌గా, 1987 నుంచి 1992వరకు నల్లగొండ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్‌టీఆర్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించాడు. సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మద్ది రెండు సార్లు శ్రీ సీతారామచంద్ర ఆలయం చైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా కొంత కాలం పని చేశారు.
పలువురు నాయకుల నివాళి..
అనారోగ్యంతో మృతి చెందిన మున్సిపల్ చైర్మన్ మద్ది విద్యాసాగర్‌రెడ్డి పార్థివదేహానికి శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఆయా పార్టీల నాయకులు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment