
రచయిత్రి బ్రోకార్డ్
లండన్: సాధారణంగా తీరని కోరికలతో చనిపోయిన వారి మనసుకు ప్రశాంతత ఉండదని భావిస్తారు. అలాంటి వారు ఆత్మలుగా మారి.. తమకు నచ్చిన వారి చుట్టు తిరుగుతుంటారని భయపడుతుంటారు చాలా మంది. ఇలాంటి అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఇదే తరహా ఘటన ఒకటి ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. 38 ఏళ్ల బ్రోకార్డ్ ఆక్స్‌ఫర్డ్ షైర్‌కు గాయనిగా పనిచేస్తుంది. బ్రోకార్డ్, ఎడ్వర్డో ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత.. ప్రియుడు ఎడ్వర్డ్ చనిపోయాడు.
ఈ క్రమంలో బ్రోకార్డ్ .. తన ప్రియుడు చనిపోయిన కూడా అతనితో ఉన్న గడిపిన క్షణాలను ప్రతి క్షణం గుర్తుచేసుకుంటు ఉండేది. అతను తన చుట్టు ఉన్నట్లు భావించేది. ఒక రోజు బ్రోకార్డ్ తన ప్రియుడు ఎడ్వర్డోతో ఉన్న సంబంధాన్ని మీడియా సమావేశంలో పంచుకుంది. ప్రియుడితో గడిపిన ప్రత్యేక క్షణాలు, ప్రేమను పబ్లిగ్గా పంచుకుంది. ఆతర్వాత నుంచి బ్రోకార్డ్.. తన ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని తెలిపింది.
ఎడ్వర్డ్ కోపంగా ఉన్నాడని నాకు అనిపిస్తోందని తెలిపింది. ఇంట్లో ఏదో రకమైన అలజడి నాకు వినిపిస్తుంది. అతను..నాపై కోపంగా ఉన్నట్లు తెలుస్తుందని బ్రోకార్డ్ బాధపడింది. మా రొమాన్స్ గురించి పబ్లిగ్గా పంచుకున్నందుకు చనిపోయిన నా ప్రియుడు కోపంగా ఉన్నాడని తెలిపింది. అయితే.. ఇంగ్లండ్‌లో హలోవిన్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. చనిపోయిన ఆత్మలు.. హలోవిన్‌ను వాలెంటైన్స్‌గా భావిస్తారని అక్కడి వారు నమ్ముతారని తెలిపింది.
తన ప్రియుడికి కెండిల్స్‌ను వెలిగించి .. నచ్చిన పదార్థాలను వండి నా ప్రియుడి ముందు ఉంచుతానని తెలిపింది. అదే విధంగా.. ప్రతి ఒక్కరికి వ్యక్తి గత విషయాలు ఉంటాయి. అవి బహిరంగంగా పంచుకుంటే బాధ, కోపం వస్తుంది. ఈ విషయంలో.. నా ప్రియుడికి కూడా అలాగే కోపం వచ్చుంటుందని బ్రోకార్డ్ బాధపడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment