![insects Found In chocolate At Peddapalli - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/4/chocklet.jpg.webp?itok=ry2Et5nf)
మంథని: ఈమధ్య పిజ్జాలు, బర్గర్లలో పురుగుల వస్తుండటం సర్వసాధారణమైపోయింది. ఇక ఐస్‌క్రీములో చచ్చిన ఎలుక రావడం కూడా మీకు గుర్తుంటే ఉంటుంది. తాజాగా చాక్లెట్‌లో పురుగుల వచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లి కిరాణం దుకాణంలో మంగళవారం ఇద్దరు చిన్నారులు చాక్లెట్ కొనుగోలు చేసి తినేందుకు ప్రయత్నించగా అందులోంచి పురుగులు బయటకు రావడంతో భయంతో కింద పడవేశారు. అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బోయిని నారాయణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment