ప్రేమికులన్నాక అలకలు, కోపాలు కామన్.. వారిని కూల్ చేయడంలో చాక్లెట్ కీ రోల్ ప్లే చేస్తోందట.. అందుకే దానికి వాలంటైన్స్ వీక్‌లో ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. ఈ రోజు(ఫిబ్రవరి 9)ను లవర్స్ చాక్లెట్ డేగా జరుపుకుంటారు. వీరప్రేమికుల్లా ఊరికే రంగంలోకి దిగితే సరిపోదు. స్వచ్ఛమైన ప్రేమను కనబరస్తూ చాకెట్లు ఇస్తే ఫలితం ఉంటుంది. అమ్మాయిలు కరిగిపోతారు. అదెలా సాధ్యమంటారా? అయితే ఇది చదివేయండి.
అమ్మాయిలకు, చాక్‌లెట్‌లకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారు మన ఎదుట ఉంటే కళ్ళలో మెరుపు, మనసుకు ఆనందం ఎలా పుట్టుకొస్తాయో... అలాంటి ఫీలింగే చాక్లెట్‌తో కూడా కల్గుతుందట. మరీ ముఖ్యంగా డార్క్ చాక్లెట్ మనసును ఉల్లాసంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. పైగా దీన్ని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇష్టంగా తింటారు. ప్రేమికులైతే ఒకరిపై మరొకరు అలిగినా, చిన్నపాటి కోపాలతో ముఖం మాడ్చుకున్నా చాక్లెట్ ఇచ్చి ఎదుటివారిని ఈజీగా కూల్ చేస్తుంటారు. ప్రేమికుల రోజు మొదలు, పుట్టినరోజు, పెళ్ళిరోజు.. ఇలా ప్రతి వేడుకలో చాక్లెట్ తప్పకుండా ఉండాల్సిందే. పశ్చిమ దేశాలలో చాక్లెట్‌ను దేవాతాహరంగా చెబుతారు. అందుకే మీరు ఆరాధించే అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే ఇట్టే బుట్టలో పడిపోతారు.
విభిన్న చాక్లెట్‌లు
► చాక్లెట్‌లు తెలుపు, డార్క్ విభిన్న రంగులలో లభిస్తున్నాయి.
► వీటిని కోకో చెట్ల నుంచి లభించే కాయల నుంచి తయారు చేస్తారు.
► విభిన్న ఆకారాలలో, అనేక ఫ్లేవర్స్‌లో మనకు అందుబాటులో ఉంటున్నాయి.
► చాక్లెట్‌లను కాఫీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీంలు వంటి వాటిల్లోనూ ఉపయోగిస్తారు.
► చాకలెట్‌లను సింపుల్ టెక్నిక్‌తో ఇంటిదగ్గర కూడా తయారు చేయవచ్చు.
చాక్లెట్ ఉపయోగాలు:
► చర్మం కాంతివంతంగా మెరిసేందుకు దోహదపడుతుంది.
► అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోయేలా చేస్తోంది.
► శారీరక బరువును తగ్గించడంతోపాటు, మానసికం ఉల్లాసానికి కారణమవుతుంది.
► ఒక చాక్లెట్ తిన్నాక మెదడు 2 నుంచి 3గంటలు ఆక్టివ్‌గా పనిచేస్తోందట.
► డార్క్ చాక్లెట్‌లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.
కాబట్టి అబ్బాయిలూ, అమ్మాయిలూ.. వెంటనే ఆలస్యం చేయకుండా ఓ చాక్లెట్ కొనేయండి. ప్రియుడి/ ప్రేమికురాలి నోరు తీపి చేసేయండి. వారి మనసు దోచేయండి. ఆల్ ద బెస్ట్!!
Comments
Please login to add a commentAdd a comment