
చాక్‌లెట్ ఫ్రీ..
చాక్‌లెట్ తలచుకుంటేనే చవులూరిస్తుంది. చాక్‌లెట్ ప్రియులకు ఇది మరింత నోరూరించే విషయం. నోట్లో వేసుకుంటే కరిగిపోయే టాప్‌క్లాస్ చాకోస్.. ఫ్రీగా వస్తున్నాయంటే అంతకన్నా కావాల్సిందేముంది? బెంగళూరుకు చెందిన జస్ట్‌బేక్ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న తమ 90 అవుట్‌లెట్స్‌లో నిర్వహిస్తున్న ‘చాకో సునామి’లో భాగంగా కస్టమర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. ‘హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మా జస్ట్‌బేక్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. వీటిని కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారు.
వారికి ఈ రకంగా మేం థాంక్యూ చెబుతున్నాం’ అంటూ తమ ఫ్రీ శాంప్లింగ్ ఆఫర్ గురించి వివరించారు సైబరాబాద్‌లోని జస్ట్‌బేక్ నిర్వాహకులు రామిరెడ్డి. బెస్ట్ యూరోపియన్ చాక్లెట్స్‌ను ఉచితంగా టేస్ట్ చేయమని ఆహ్వానిస్తున్న మొదలైన ఈ ఆఫర్ వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తుల్లో చాకొలెట్ బార్స్, సెంటర్ ఫిల్డ్ చాకొలెట్స్, మౌస్సి, శాబుల్స్.. ఉన్నాయి. జస్ట్‌బేక్ అవుట్‌లెట్ సందర్శించిన సింగర్ హేమచంద్ర చాక్‌లెట్ రుచులను ఆస్వాదించారు.
ఏం చేయాలి?
‘కస్టమర్స్ మా వెబ్‌సైట్www.justbake.in లో విజిట్ చేసి కూపన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 56677కు JB choco అని ఎస్సెమ్మెస్ పంపితే చాలు.. ఈ వారం రోజులూ చాకొలెట్ ట్రీట్ ఫ్రీగా అందిస్తాం’ అని తెలిపారు నిర్వాహకులు.