స్వీట్‌గా.. క్యూట్‌గా... | Size Zero to release on October 9th | Sakshi
Sakshi News home page

స్వీట్‌గా.. క్యూట్‌గా...

Published Sun, Sep 27 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

స్వీట్‌గా.. క్యూట్‌గా...

స్వీట్‌గా.. క్యూట్‌గా...

చిన్నతనం నుంచి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లను చూస్తే ఆమెకు నోరూరిపోతుంది. అవన్నీ లాగించేసి బొద్దుగా తయారైంది.

చిన్నతనం నుంచి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లను చూస్తే ఆమెకు నోరూరిపోతుంది. అవన్నీ లాగించేసి బొద్దుగా తయారైంది. ఆమె భారీ సైజ్‌ను చూసి అబ్బాయిలు కూడా ‘బాబోయ్’ అంటూ పారిపోతారు కూడా. అయినా ఆ అమ్మాయి బాధపడలేదు. కానీ తన మనసుకు నచ్చినవాడి కోసం జీరో సైజ్‌లోకి మారిపోదామని డిసైడయ్యింది. మరి.. ఈ అమ్మాయి బరువు తగ్గడానికి ఏమేం చేసింది? తాను అనుకున్నట్లు సన్నబడగలిగిందా? అనే కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైజ్ జీరో’.

అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ క్రియేషన్స్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది.  నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, పోస్టర్స్‌లో అనుష్క లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం, నిరవ్ షా ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. అందరినీ న వ్వించే స్వీట్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: ఆనందసాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement