బంగారం లాంటి అవకాశం! | size zero watch get 1 kg gold free! | Sakshi
Sakshi News home page

బంగారం లాంటి అవకాశం!

Published Mon, Nov 23 2015 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

బంగారం లాంటి అవకాశం!

బంగారం లాంటి అవకాశం!

‘‘అనుష్కతో స్పెషల్‌గా చాట్ చేయాలనుకుంటున్నారా? కేజీ బంగారం గెలవాలనుకుంటున్నారా?... అయితే మా ‘సైజ్ జీరో’ చిత్రాన్ని మిస్ కావొద్దు’’ అని ప్రసాద్ వి. పొట్లూరి అంటున్నారు. అనుష్క, ఆర్య జంటగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చితం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర ్భంగా  నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం కోసం అనుష్క చాలా కష్టపడింది. ఆమె కష్టం వృథా కాకూడదని బాగా ప్రమోట్ చేస్తున్నాం.

ఇందులో భాగంగానే కార్వీ సహకారంతో ‘కేజీ బంగారం గెలవండి’ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ప్రేక్షకులకు సినిమా టిక్కెట్‌తో పాటు ఒక కూపన్‌ని ఇస్తారు. అందులోని 11 డిజిట్స్ కోడ్‌ను ‘పివిపి సినిమా.కామ్’ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాకాకున్నా కూపన్‌లో ఇచ్చిన సెల్ నంబర్‌కు వివరాలు మెసేజ్ పంపాలి. వీరిలో 20మంది ప్రేక్షకులను ఎంపిక చేస్తాం. వారితో అనుష్క స్పెషల్ చాటింగ్ ఉంటుంది. ఆ 20 మందిలో ఒక లక్కీ విన్నర్‌కు కేజీ బంగారం ఇస్తాం.

ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడాలనే సంకల్పంతో ఈ కాంటెస్ట్ పెడుతున్నాం’’ అని తెలిపారు. అనుష్క, దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement