Kg Gold
-
యాదాద్రిలో సీఎం కేసీఆర్.. కిలో బంగారం సమర్పించి మొక్కు చెల్లింపు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. బంగారు తాపడం కోసం వారి కుటుంబం తరపున కిలో 16 తులాల బంగారం స్వామి వారికి కానుకగా ఇచ్చారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. శనివారం వరంగల్‌కు.. సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ వరంగల్‌లో నిర్మించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే అవకాశముంది. జాతీయ పార్టీ పేరు, ముహూర్తంపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. జాతీయ పార్టీపై దసరా రోజు అధికారిక ప్రకటన చేయనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రూ.80 కోట్లతో కొనుగోలుకు టీఆర్ఎస్ నిర్ణయం -
శంషాబాద్‌లో కేజీ బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం దుబాయి విమానంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా దుబాయి నుంచి ఓ ప్రయాణికుడిని తనిఖీలు చేయగా ఒక కేజీ వరకు బంగారం దొరికినట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారు తెచ్చిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి రాజమండ్రికి చెందినవాడిగా గుర్తించారు. -
బంగారం లాంటి అవకాశం!
‘‘అనుష్కతో స్పెషల్‌గా చాట్ చేయాలనుకుంటున్నారా? కేజీ బంగారం గెలవాలనుకుంటున్నారా?... అయితే మా ‘సైజ్ జీరో’ చిత్రాన్ని మిస్ కావొద్దు’’ అని ప్రసాద్ వి. పొట్లూరి అంటున్నారు. అనుష్క, ఆర్య జంటగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చితం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర ్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం కోసం అనుష్క చాలా కష్టపడింది. ఆమె కష్టం వృథా కాకూడదని బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే కార్వీ సహకారంతో ‘కేజీ బంగారం గెలవండి’ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ప్రేక్షకులకు సినిమా టిక్కెట్‌తో పాటు ఒక కూపన్‌ని ఇస్తారు. అందులోని 11 డిజిట్స్ కోడ్‌ను ‘పివిపి సినిమా.కామ్’ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాకాకున్నా కూపన్లో ఇచ్చిన సెల్ నంబర్‌కు వివరాలు మెసేజ్ పంపాలి. వీరిలో 20మంది ప్రేక్షకులను ఎంపిక చేస్తాం. వారితో అనుష్క స్పెషల్ చాటింగ్ ఉంటుంది. ఆ 20 మందిలో ఒక లక్కీ విన్నర్‌కు కేజీ బంగారం ఇస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడాలనే సంకల్పంతో ఈ కాంటెస్ట్ పెడుతున్నాం’’ అని తెలిపారు. అనుష్క, దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎయిర్ పోర్ట్‌లో కిలో బంగారం పట్టివేత
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం అక్రమ రవాణా వెలుగుచూసింది. శుక్రవారం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి కస్టమ్స్ అధికారులు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారాన్ని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రయణాకిడి లగేజిని తనిఖీ చేయగా అందులో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో కేజీ బంగారం స్వాధీనం
-
ఎయిర్‌పోర్ట్‌లో కేజీ బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దుబాయి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతడి లగేజీలో కేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు.