స్వీట్‌గా.. క్యూట్‌గా...
చిన్నతనం నుంచి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లను చూస్తే ఆమెకు నోరూరిపోతుంది. అవన్నీ లాగించేసి బొద్దుగా తయారైంది. ఆమె భారీ సైజ్‌ను చూసి అబ్బాయిలు కూడా ‘బాబోయ్’ అంటూ పారిపోతారు కూడా. అయినా ఆ అమ్మాయి బాధపడలేదు. కానీ తన మనసుకు నచ్చినవాడి కోసం జీరో సైజ్‌లోకి మారిపోదామని డిసైడయ్యింది. మరి.. ఈ అమ్మాయి బరువు తగ్గడానికి ఏమేం చేసింది? తాను అనుకున్నట్లు సన్నబడగలిగిందా? అనే కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైజ్ జీరో’.
అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ క్రియేషన్స్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, పోస్టర్స్‌లో అనుష్క లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం, నిరవ్ షా ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. అందరినీ న వ్వించే స్వీట్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: ఆనందసాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం.