హీరో కోసం ఒకరు, హీరోయిన్ కోసం మరొకరు | Nagarjuna, jeeva guest appearence in size zero | Sakshi
Sakshi News home page

హీరో కోసం ఒకరు, హీరోయిన్ కోసం మరొకరు

Published Sun, Nov 1 2015 12:40 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

హీరో కోసం ఒకరు, హీరోయిన్ కోసం మరొకరు - Sakshi

హీరో కోసం ఒకరు, హీరోయిన్ కోసం మరొకరు

ఇటీవల కాలంలో దక్షిణాది హీరోలు ఫ్రెండ్ షిప్ కోసం కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో సీనియర్ హీరో నాగార్జున ఇలా ఫ్రెండ్స్ కోసం చాలా సినిమాల్లో నటించాడు. మోహన్ బాబు, విష్ణు లాంటి హీరోలతో కలిసి నటించిన నాగ్ తాజాగా తను వెండితెరకు పరిచయం చేసిన అందాల భామ అనుష్క కోసం మరోసారి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ హిట్స్ తరువాత అనుష్క లీడ్ రోల్లో నటిస్తున్న మరో సినిమా సైజ్ జీరో.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనయుడు, కెయస్ ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సాహసమే చేసింది ఈ యోగా బ్యూటి. ఈ సినిమాలో లావుగా కనిపించటం కోసం చాలా బరువు పెరిగింది. ఇలా ఎంతో రిస్క్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తన సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అనుష్క రిస్క్ చేసి మరి చేస్తున్న ఈ సినిమా కోసం నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడు.

తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగులో నాగార్జున కనిపించిన పాత్రలో తమిళ్లో మాత్రం యంగ్ హీరో జీవా కనిపించనున్నాడట. సైజ్ జీరోలో హీరోగా నటించిన ఆర్యతో ఉన్న స్నేహం కారణంగా జీవా ఈ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించారు. గతంలో కూడా ఆర్య హీరోగా నటించిన 'బాస్ ఎంగిర భాస్కరన్' సినిమాలో గెస్ట్ రోల్లో నటించాడు జీవా. తాజాగా మరోసారి ఫ్రెండ్షిప్ కోసం అదేపని చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement