ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? | anushka size zero's first look | Sakshi
Sakshi News home page

ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?

Published Sat, Aug 15 2015 11:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

anushka size zero's first look

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా?...చెప్పుకోండి చూద్దాం... ఆమెను ఎక్కడో చూసినట్లు ఉంది కదూ... ఎవరో కాదండి బాబూ...అందాల తార అనుష్క.  బాహుబలి చిత్రంలో దేవసేనగా కనిపించిన ఆమె ఇప్పుడు 'సైజ్ జీరో'  చిత్రంలో న్యూ లుక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న సైజ్ జీరో  (సన్నజాజి నడుము- ట్యాగ్ లైన్) సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ చేశారు.  యోగాతో చెక్కిన శిల్పంలా ఉండే అనుష్క ఈ చిత్రంలో తన పాత్ర కోసం దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బొద్దుగా, మొహానికి కళ్లజోడుతో  అనుష్క డిఫరెంట్ లుక్లో కనిపిస్తోంది.

పీవీపీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రంలో  ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా  1500 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.  'అనగనగా ఓ ధీరుడు' తర్వాత గ్యాప్ తీసుకున్న ప్రకాశ్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే... ప్రకాశ్ సతీమణి కనికా థిల్లాన్ ఈ సినిమాకు కథ అందించడం. తెలుగు, తమిళర భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement