తగ్గాలని తాపత్రయం! | Size Zero Audio to be Released on the 1st of November | Sakshi
Sakshi News home page

తగ్గాలని తాపత్రయం!

Published Sun, Oct 25 2015 1:20 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

తగ్గాలని తాపత్రయం! - Sakshi

తగ్గాలని తాపత్రయం!

 ప్రపంచంలో ఆమెకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి చాక్లెట్స్... ఇంకోటి ఐస్‌క్రీమ్స్. బరువు పెరుగుతున్నా సరే లెక్క చేయకుండా వీర  లెవల్లో లాగించేసి భారీ సైజ్‌కు వచ్చేసింది. తర్వాత తన కెంతో ఇష్టమైన ప్రియుని కోసం ఇవన్నీ త్యాగం చేసి జీరో సైజ్‌కు ఎలా మారిపోయిందనే కథాంశంతో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘సైజ్ జీరో’. అనుష్క, ఆర్య, సోనాల్‌చౌహాన్ ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం పాటలను నవంబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement