అనుష్క చిత్రానికి యమ క్రేజ్ | Size Zero movie FULL Craze | Sakshi
Sakshi News home page

అనుష్క చిత్రానికి యమ క్రేజ్

Published Sun, Sep 6 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

అనుష్క చిత్రానికి యమ క్రేజ్

అనుష్క చిత్రానికి యమ క్రేజ్

నటి అనుష్క చిత్రం అనూహ్య క్రేజ్ సంపాదించుకుంది. ఆ చిత్రం ఏమిటని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? తమిళంలో ఇంజి ఇడుప్పళగి పేరుతోనూ, తెలుగులో సైజ్ జీరో పేరుతోనూ రూపొందుతున్న ద్విభాషా చిత్రం గురించే ఈ ప్రస్థావన. ఇందులో హీరో ఆర్య ఉండగా అనుష్క చిత్రం అంటారేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోందా?ఆర్య ప్రకాశ్‌రాజ్, సోనల్‌సుహాన్, మాస్టర్ భరత్ ఇలా చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. అయితే ఇది పూర్తిగా నటి అనుష్క చుట్టూ తిరిగే కథ. ఆమె అందం, మందం అంశాలను చర్చించే ఇతి వృత్తం. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై అనూహ్య ఆదరణను పొందిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
 
 ఈ టీజర్ విడుదలైన రెండు రోజుల్లోనే యూట్యూబ్‌లో రెండు లక్షల మంది వీక్షించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.ముఖ్యంగా ముద్దుగా, బొద్దుగా ఉన్న హన్సిక రూపం, సన్నగా, అందంగా ఉన్న రూపాలు సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నట్లు,ఇందులో బొద్దుగా ఉండడానికి అనుష్క సుమారు 20 కిలోల బరువు పెరగడం వంటి అంశాలు ఇంజి ఇడుప్పళగి చిత్రంపై అంచనాలను పెంచేశాయని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది. మరగదమణి(కీరవాణి) సంగీతబాణీలందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement