న్యూఢిల్లీ: సాల్మెనెల్లా బాక్టీరియానుప్రపంచంలోనే అతిపెద్దది చాక్లెట్ ప్లాంట్‌లో కనుగొన్నారు. బెల్జియం పట్టణంలోని వైజ్‌లోని బెల్గో-స్విస్ దిగ్గజం బెర్రీ కాల్‌బాట్ నిర్వహిస్తున్న చాక్లెట్ ప్లాంట్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియాను గుర్తించామని సంస్థ గురువారం తెలిపింది. దీంతో లిక్విడ్ చాక్లెట్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది.
దీనిపై బెల్జియం ఆహార భద్రత ఏజెన్సీ కి సమాచారం అందించినట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే చాలా ఉత్పత్తులు ఇప్పటికీ సైట్‌లో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం కలుషితమైన ఉత్పత్తులను స్వీకరించిన వినియోగదారులందరికి సమాచారమిచ్చామని, తదుపరి నోటీసుల వరకు వైజ్‌లో చాక్లెట్ ఉత్పత్తి నిలిపివేసినట్టు ప్రకటించింది. జూన్ 25 నుండి తమ చాక్లెట్‌తో తయారు చేసిన ఉత్పత్తులను పంపిణీ చేయొద్దని కోరింది. ఆహార పరిశ్రమలోని అనేక కంపెనీలకు కోకో, చాక్లెట్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ముఖ్యంగా హెర్షే, మోండెలెజ్, నెస్లే లేదా యూనీలీవర్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇందులో ఉన్నాయి. 2020-2021 ఆర్థికసంవత్సరంలో కంపెనీవార్షిక అమ్మకాలు 2.2 మిలియన్ టన్నులు. ఈ కంపెనీ గ్రూపులో13 వేలకు పైగా ఉద్యోగులుండగా, ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ ఉత్పత్తి ప్లాంట్‌లున్నాయి.
కాగా గత ఏడాదిలో అమెరికాలో సాల్మొనెల్లా వ్యాధి విస్తరణ వణికించిన సంగతి తెలిసిందే. ఈ బాక్టీరియాతో జ్వరం, వాంతులు, డయేరియా, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది ప్రాణంతక వ్యాధి కాదు.
Comments
Please login to add a commentAdd a comment