Belgiam
-
మన పాలపుంత ఆవల... నిద్రాణ కృష్ణబిలం
న్యూయార్క్: సూర్యుడి కంటే 9 రెట్లు పెద్దదైన భారీ కృష్ణబిలాన్ని(బ్లాక్ హోల్) బెల్జియం పరిశోధకులు గుర్తించారు. భూమికి కేవలం 1,60,000 కాంతి సంవత్సరాల దూరంలో మెగెలానిక్ క్లౌడ్ అనే నక్షత్ర మండలంలో ఇది నిద్రాణ స్థితిలో ఉన్నట్లు తేల్చారు. ఒక కాంతి సంవత్సరం అంటే 9,460,730,472,580.8 కిలోమీటర్లు. ‘బ్లాక్‌హోల్ పోలీసు’గా పిలిచే పరిశోధకుల బృందం దాదాపు 1,000 నక్షత్రాలను నిశితంగా పరిశోధించి, ఈ బ్లాక్‌హోల్‌ను కనిపెట్టింది. మన భూగోళం ఉన్న పాలపుంత, నక్షత్ర మండలం వెలుపల బయటపడిన తొలి నిద్రాణ కృష్ణబిలం ఇదేనని చెబుతున్నారు. భారీ నక్షత్రాల జీవితకాలం ముగిసి, సొంత గురుత్వాకర్షణ శక్తిలోనే కూలిపోయినప్పుడు ఇలాంటి కృష్ణబిలాలు ఏర్పడుతుంటాయని పేర్కొంటున్నారు. నిద్రాణ స్థితిలోని బ్లాక్‌హోల్స్ నిస్తేజంగా ఉంటాయి. అంటే కాంతిని గానీ, రేడియేషన్‌ను గానీ వెలువరించవు. పరిసరాలతో ఎలాంటి సంబంధాలు ఉండని నిద్రాణ బ్లాక్‌హోల్స్‌ను గుర్తించడం కష్టమే. -
సాల్మొనెల్లా: ఉత్పత్తి నిలిపివేసిన అతిపెద్ద చాక్లెట్ ఫాక్టరీ
న్యూఢిల్లీ: సాల్మెనెల్లా బాక్టీరియానుప్రపంచంలోనే అతిపెద్దది చాక్లెట్ ప్లాంట్‌లో కనుగొన్నారు. బెల్జియం పట్టణంలోని వైజ్‌లోని బెల్గో-స్విస్ దిగ్గజం బెర్రీ కాల్‌బాట్ నిర్వహిస్తున్న చాక్లెట్ ప్లాంట్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియాను గుర్తించామని సంస్థ గురువారం తెలిపింది. దీంతో లిక్విడ్ చాక్లెట్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. దీనిపై బెల్జియం ఆహార భద్రత ఏజెన్సీ కి సమాచారం అందించినట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే చాలా ఉత్పత్తులు ఇప్పటికీ సైట్లో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం కలుషితమైన ఉత్పత్తులను స్వీకరించిన వినియోగదారులందరికి సమాచారమిచ్చామని, తదుపరి నోటీసుల వరకు వైజ్‌లో చాక్లెట్ ఉత్పత్తి నిలిపివేసినట్టు ప్రకటించింది. జూన్ 25 నుండి తమ చాక్లెట్‌తో తయారు చేసిన ఉత్పత్తులను పంపిణీ చేయొద్దని కోరింది. ఆహార పరిశ్రమలోని అనేక కంపెనీలకు కోకో, చాక్లెట్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ముఖ్యంగా హెర్షే, మోండెలెజ్, నెస్లే లేదా యూనీలీవర్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇందులో ఉన్నాయి. 2020-2021 ఆర్థికసంవత్సరంలో కంపెనీవార్షిక అమ్మకాలు 2.2 మిలియన్ టన్నులు. ఈ కంపెనీ గ్రూపులో13 వేలకు పైగా ఉద్యోగులుండగా, ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. కాగా గత ఏడాదిలో అమెరికాలో సాల్మొనెల్లా వ్యాధి విస్తరణ వణికించిన సంగతి తెలిసిందే. ఈ బాక్టీరియాతో జ్వరం, వాంతులు, డయేరియా, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది ప్రాణంతక వ్యాధి కాదు. -
ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియంతో భారత్ ‘ఢీ’
అమిత్ రోహిదాస్ కెప్టెన్సీలోని భారత జట్టు నేడు ఆంట్వర్ప్లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియం జట్టుతో ఆడనుంది. రెండు జట్లూ 27 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంది. ఈ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ మొత్తం 16 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1, డిస్నీ–హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి:Indonesia Masters 2022: సింధు నిష్క్రమణIndonesia Masters 2022: సింధు నిష్క్రమణ -
‘క్వారంటైన్ ఉల్లంఘించాను.. క్షమించండి’
బ్రస్సెల్స్: ‘క్వారంటైన్ నియమాలు ఉల్లంఘించి ఓ సామాజిక కార్యక్రమానికి హాజరయ్యాను. క్షమించండి’ అంటూ బెల్జియన్ యువరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు.. బెల్జియం రాజు ఫిలిప్పి మేనల్లుడు ప్రిన్స్ జోచిమ్ (28) ఒక స్పానిష్ స్నేహితురాలి కుటుంబంలో జరిగిన సామాజిక కార్యక్రమానికి హాజరయినట్లు అధికారుల ప్రకటించారు. యువరాజు మే 24న బెల్జియం నుంచి స్పెయిన్ వెళ్లారు. మే 26న 12-27 మంది అతిథులు హాజరైన ఓసామాజిక సమావేశానికి వెళ్లినట్లు బెల్జియన్ ప్యాలెస్ ప్రెస్ ఆఫీస్ తెలిపింది. రెండు రోజుల తరువాత యువరాజుకు.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ సందర్భంగా జోచిమ్ ‘క్వారంటైన్ నియమాలు ఉల్లంఘించి వేరే ప్రాంతానికి ప్రయాణం చేశాను. ఈ క్లిష్ట సమయాల్లో నేను ఎవరినీ కించపరచాలని, అగౌరవపరచాలని అనుకోలేదు. నా చర్యల పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. పర్యవసానాలను అంగీకరిస్తాను’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. అయితే కొన్ని మినహాయింపులతో దేశానికి వచ్చే ప్రయాణికులు.. రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. సభలు సమావేశాలు వంటి వాటికి 15 మందికి పైగా హాజరుకాకుడదు. అయితే జోచిమ్ వెళ్లిన సామాజిక కార్యక్రమానికి 15 మందికి పైగా వచ్చినట్లు స్పానిష్ ప్రభుత్వ ప్రతినిధి రాఫేలా వాలెన్జులా సోమవారం మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమంలో 27 మంది వరకు ఉండవచ్చునని ప్రాంతీయ ఆరోగ్య అధికారులు స్పానిష్ ప్రభుత్వానికి తెలియజేశారన్నారు. (కరోనా: క్వారెంటైన్‌లోకి మరో ప్రధాని) అయితే స్పెయిన్ అధికారుల వ్యాఖ్యలను ప్రిన్స్ లా ఆఫీస్ ప్రతినిధి ఖండించారు. ప్రిన్స్ ఒక స్నేహితురాలి కుటుంబంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారని తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి 15 మంది కంటే ఎక్కువ హాజరు కాలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం యువరాజు తేలికపాటి కరోనావైరస్ లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. -
భారత్‌కు ‘డ్రా’నందం
భారత్ బాగా ఆడింది. తమకన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న బెల్జియం జట్టును దాదాపు ఓడించినంత పని చేసింది. కానీ చివరి నిమిషాల్లో తడబడే అలవాటు ఆతిథ్య జట్టును మళ్లీ వెంటాడింది. తుదకు గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది. భువనేశ్వర్ ప్రపంచకప్ హాకీలో భారత్ మరో స్ఫూర్తిదాయక పోరాటం చేసింది. రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియం జట్టును నిలువరించింది. పూల్ ‘సి’లో భాగంగా ఆదివారం భారత్, బెల్జియం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. ఆరంభంలో తడబడినప్పటికీ మ్యాచ్ జరిగేకొద్దీ ఆతిథ్య జట్టు ఆటగాళ్లు పుంజుకున్నారు. ఒక దశలో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను కంగుతినిపించే స్థితిలో నిలిచింది. అయితే చివరి క్షణాల్లో గోల్స్ సమర్పించుకొనే అలవాటును భారత్ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. ఆతిథ్య జట్టులో హర్మన్‌ప్రీత్ సింగ్ (39వ ని.లో), సిమ్రన్‌జీత్ సింగ్ (47వ ని.లో) చెరో గోల్ చేయగా, బెల్జియం తరఫున హెన్డ్రిక్స్ (8వ ని.లో), సైమన్ గోనర్డ్ (56వ ని.లో) గోల్స్ సాధించారు. ఆఖరి నిమిషాల్లో భారత డిఫెన్స్ కాస్త డీలా పడటంతో ఇదే అదనుగా భావించిన సైమన్ బెల్జియంను ఓటమి నుంచి తప్పించాడు. ఫలితం ‘డ్రా’ అయినా... ఈ పూల్‌లో భారతే అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో 5–0తో గెలుపు, గోల్స్ పరంగా బెల్జియం కంటే భారత్‌నే ముందువరుసలో నిలబెట్టింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బెల్జియం తొలి మ్యాచ్‌లో (2–1తో) కెనడాను ఓడించినా... గోల్స్ రేట్లో భారతే ఎంతో ముందుంది. ఈ పూల్‌లో ఇరుజట్లకు ఇక ఒకే మ్యాచ్ మిగిలుంది. ఈ నెల 8న జరిగే మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్, దక్షిణాఫ్రికాతో బెల్జియం తలపడతాయి. ఇవి ముగిశాక తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో భారత్ అగ్రస్థానంలోనే ఉంటే నేరుగా క్వార్టర్స్ చేరుకుంటుంది. కెనడా, దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా... ఇదే పూల్‌లో కెనడా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ కూడా 1–1తో ‘డ్రా’ అయింది. ఇరు జట్ల ఆటగాళ్లు దీటుగా కదంతొక్కడంతో రెండు క్వార్టర్లు గోల్ లేకుండానే ముగిశాయి. మూడో క్వార్టర్ చివర్లో దక్షిణాఫ్రికా తరఫున ఎన్కొబిలి ఎన్తులి (43వ ని.) గోల్ చేయగా, రెండు నిమిషాల వ్యవధిలోనే కెనడా కెప్టెన్ స్కాట్ టపర్ (45వ ని.) గోల్ చేసి స్కోరును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; న్యూజిలాండ్‌తో అర్జెంటీనా తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
బెల్జియంలో ఉగ్రదాడి..?
-
బెల్జియంలో దుండగుడి కాల్పులు
లీజ్: బెల్జియంలోని లీజ్ సిటీలో ఓ దుండగుడు రెచ్చిపోయి ఓ పౌరుడితో పాటు ఇద్దరు పోలీసుల్ని హత్యచేశాడు. అనంతరం సమీపంలోని స్కూల్లో ఓ మహిళను బందీగా చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగుడ్ని మట్టుబెట్టారు. మంగళవారం ఉదయం లీజ్‌లో దుండగుడు విధుల్లో ఉన్న ఇద్దరు పోలీస్ అధికారుల్ని కత్తితో పలుమార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. వారివద్ద ఉన్న తుపాకులతో ఇద్దరు అధికారుల్ని కాల్చిచంపాడు. తుపాకులతో కొద్దిదూరం వెళ్లాక కారులో ఉన్న ఓ యువకుడిని కాల్చిచంపాడు. -
11 ఏట విడిపోయి.. 89 ఏట కలిశారు!
లాస్ఏంజిలెస్ : పాలకుల క్రూరత్వానికి ఎందరో బలిపశువులుగా మారారు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ముఖ్యంగా నాజీల కాలంలో చోటుచేసుకున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ఉన్నవారిని, పెరిగిన ఊరును, దేశాన్నే వదిలి ఎంతోమంది వెళ్లిపోయారు. అలాంటివారిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు దాదాపు 76 ఏళ్ల తర్వాత కలిశారు. ఆ వివరాల్లోకెళ్తే.. 1940వ సంవత్సరం.. నాజీలు బెల్జియంను ముట్టడించారు. అప్పటికే ప్రాణ స్నేహితులైన సైమన్, గస్టిల్ వెయిట్స్ కూడా విడిపోయారు. సైమన్ కుటుంబం నాజీల చేతిలో బలైపోయింది. దీంతో వెయిట్స్ తండ్రి తనకున్న సంపదనంతా నగదుగా మార్చి, క్యూబా వెళ్లే షిప్ ఎక్కారు. బ్రసెల్స్ వెళ్లి తలదాచుకోవచ్చని భావించారు. అయితే ఇన్నేళ్ల తర్వాత సైమన్ కుటుంబంలో మిగతావారంతా చనిపోయినా.. సైమన్ మాత్రం బతికే ఉన్నాడని వెయిట్స్‌కు తెలిసింది. దీంతో లాస్ ఏంజిలెస్‌లో స్థిరపడిన వెయిట్స్.. సైమన్స్ ఆచూకీ కోసం ఎంతగానో ప్రయత్నించి, చివరికి జాడ తెలుసుకుంది. లాస్ ఏంజిలెస్ మ్యూజియం సాక్షిగా ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. 11 ఏళ్లునప్పుడు విడిపోయిన వీరిద్దరు దాదాపు 89 ఏళ్ల వయసులో కలుసుకొని, కన్నీళ్లతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. -
హైస్పీడ్ వేగంతో ట్రైన్స్ ఢీ
-
ఒకే ట్రాక్‌పై హైస్పీడ్ వేగంతో ట్రైన్స్ ఢీ
బ్రస్సెల్స్: బెల్జియంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును అదే ట్రాక్ పై హై స్పీడ్ తో వెనుక నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలుకోల్పోగా 40మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఆరు బోగీలతో ప్యాసింజర్ రైలు ఉండగా అందులో రెండు బోగీలు పక్కకు తప్పాయి. అందులో రైలు డ్రైవర్ ఉన్న ఇంజిన్ బోగి పూర్తిగా రివర్స్ తిరిగింది. అధికారులు తెలిపిన ప్రకారం దేశంలోని తూర్పు ప్రాంతాలైన నాముర్-లీగ్ లను కలిపే రైలు మార్గంపై ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్సు రైలును ఢీకొనె సమయంలో ప్యాసింజర్ రైలు హై స్పీడ్ వేగంతో ఉందని, చాలా భయంకరంగా ప్రమాద దృశ్యం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం బాధితులను రక్షించే చర్యల్లో అధికారులు మునిగిపోయారు. ఈ రైలు ఢీకొన్న సమయంలో ఓ బాంబు పేలినంత పెద్ద శబ్దం వేసిందంటే ఎంత వేగంతో రైలు ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు. -
బ్రసెల్స్‌లో ఉగ్రదాడి
♦ 34 మంది మృత్యువాత ♦ 200 మందికి గాయాలు బెల్జియం రాజధానిలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఐసిస్ బ్రసెల్స్: ఉగ్రభూతం మరోసారి జడలు విప్పింది. పారిస్ దారుణం మరవకముందే యూరోప్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్ర కర్కష రక్కసులు మరోసారి రెచ్చిపోయారు. వరుస పేలుళ్లతో బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నెత్తుటేర్లు పారించారు. మంగళవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు అత్యంత శక్తిమంతమైన పేలుళ్లకు, యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం దగ్గర్లోని భూగర్భ మెట్రోస్టేషన్లో ఓ భారీ విస్ఫోటనానికి పాల్పడి 34 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ పేలుళ్లలో మరో 200 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. ఎయిర్పోర్ట్ పేలుళ్లలో 14 మంది, మెట్రో స్టేషన్లో జరిగిన పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్పోర్ట్ పేలుళ్ల క్షతగాత్రుల్లో జెట్ ఎయిర్వేస్కు చెందిన ఇద్దరు భారతీయ ఉద్యోగులు నిధి చాపేకర్, అమిత్ మోత్వానీ ఉన్నారు. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) ప్రకటించింది. మరిన్ని దాడులు చేసేందుకు మరికొందరు ఉగ్రవాదులు బ్రసెల్స్ నగరంలోనే ఉండి ఉండొచ్చన్న ఆందోళన ఉందని బెల్జియం విదేశాంగమంత్రి డిడియర్ రీండర్స్ వ్యాఖ్యానించారు. నాటో, యూరోపియన్ యూనియన్ సంస్థల ప్రధాన కార్యాలయాలున్న బ్రసెల్స్‌లో జరిగిన ఈ తాజా దాడులతో ఉలిక్కిపడ్డ యూరోప్ దేశాలన్నీ భద్రతా చర్యలను తీవ్రం చేశాయి. బ్రసెల్స్‌కు రవాణా మార్గాలను మూసేశాయి. విమానాశ్రయాలు, ఇతర ప్రధాన కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ భీకర పేలుళ్లపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రపంచ దేశాల అధినేతలు.. బెల్జియంకు సంఘీభావం తెలుపుతూ, ఉగ్రవాదంపై పోరును తీవ్రం చేస్తామని పునరుద్ఘాటించారు. ఉగ్రదాడులను పిరికి చర్యగా అభివర్ణించిన బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్.. దేశానికి ఇది విషాదభరితమైన బ్లాక్ డే అన్నారు. పారిస్ దాడుల సూత్రధారి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ కీలక నేత సలాహ్ అబ్దెస్లామ్ను బ్రసెల్స్ శివార్లలో అరెస్ట్ చేసిన వారంలోపే ఈ దాడులు జరిగాయి. బ్రసెల్స్‌లో కూడా దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు అబ్దెస్లామ్ విచారణలో అంగీకరించారని రీండర్స్ వెల్లడించారు. ‘ఉగ్రదాడుల గురించి భయపడుతూనే ఉన్నాం’ అని బెల్జియం పీఎం చార్లెస్ వ్యాఖ్యానించారు. భయానకం.. బీభత్సం.. రెండు అత్యంత శక్తిమంతమైన పేలుళ్ల అనంతరం జావెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మెయిన్ హాల్లో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రక్తపు మడుగుల్లో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, తెగిపోయిన శరీరావయవాలతో క్షతగాత్రులు, భయవిహ్వలతతో పరగులు తీస్తున్న ప్రయాణీకులు, పేలుడు ధాటికి ఊడిపడిన సీలింగ్, పగిలిపోయి, చెల్లాచెదురుగా పడిన గ్లాస్ డోర్స్ ముక్కలు, భారీగా కమ్ముకున్న పొగ, గన్‌పౌడర్ వాసనతో భయానక వాతావరణం నెలకొందన్నారు. ఈ దాడిలో ఒక ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘అరబిక్ భాషలో గట్టిగా రెండుమూడు అరుపులు వినిపించాయి. కాల్పుల శబ్దాలు వినిపించాయి. అనంతరం చెవులు చిల్లులు పడేలా భారీ విస్ఫోటనం జరిగింది. పేలుళ్లలో చాలామంది చేతులు, కాళ్లు తెగిపోయాయి. ఒక వ్యక్తి రెండు కాళ్లు ఛిద్రమయ్యాయి’ అని ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్‌ను చెక్‌చేసే భద్రతాధికారి అల్ఫాన్సో ల్యూరా తెలిపారు. దాడుల అనంతరం ఒక అనుమానాస్పద బ్యాగ్‌ను ఆర్మీ అధికారులు పేల్చేశారు. వారికి ఆత్మాహుతికి ఉపయోగించే పేలుడు పదార్థాలున్న షర్ట్ కూడా లభించిందని స్థానిక మీడియా పేర్కొంది. విమానాశ్రయంలో జరిగిన జంట పేలుళ్లలో 14 మంది చనిపోగా, 96 మంది గాయాల పాలయ్యారు. మాల్బీక్ సబ్వే మెట్రో స్టేషన్లో ఉదయం రద్దీ సమయంలో చోటు చేసుకున్న భారీ పేలుడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 106 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. విధులకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పేలుడు జరగడంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉంది. నిలిచిపోయిన రవాణా: ఉగ్ర దాడుల నేపథ్యంలో జావెంటమ్ విమానాశ్రయాన్ని మూసేశారు. ఇతర విమానాశ్రయాల్లోనూ సర్వీసులను నిలిపేశారు. బ్రసెల్స్‌లో మెట్రో, ట్రామ్, బస్ సర్వీస్‌లను సైతం ఆపేశారు. బెల్జియంకు విమాన, రైలు సర్వీసులను యూరోప్ దేశాలు నిలిపేశాయి. లండన్, పారిస్, ఫ్రాంక్ఫర్ట్, ఆమ్స్టర్డామ్ సహా ప్రధాన విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బెల్జియంలోని అన్ని అణు కేంద్రాలు, ప్రధాన ప్రభుత్వ భవనాల వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న ఈయూ పార్లమెంట్, ఇతర ఈయూ భవనాల వద్ద భద్రతను భారీగా పెంచారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని, ఎక్కడివారక్కడే ఉండాలని, సంయమనం పాటించాలని బెల్జియం ఉప ప్రధాని అలెగ్జాండర్ డీ క్రూ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సర్వీసులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి.. అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి, నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెంచొద్దని సూచించారు. బదులుగా, ఎస్ఎంఎస్లు చేసుకోవాలన్నారు. బెల్జియంలో ఉగ్రవాద హెచ్చరిక స్థాయిని 3 నుంచి నాలుగు(అత్యున్నత స్థాయి)కు పెంచినట్లు హోంమంత్రి జాన్ జాంబాన్ వెల్లడించారు. పారిస్ దాడుల సూత్రధారి అరెస్ట్ కాగానే! గత నవంబర్‌లో పారిస్‌పై భీకర దాడుల ప్రధాన నిందితుడు సలాహ్ అబ్దెస్లామ్ను గత శుక్రవారం బ్రసెల్స్ శివార్లలోని మెలెన్బీక్లో, ఆయన కుటుంబం నివసిస్తున్న ఇంటికి దగ్గరలో బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్ దాడుల అనంతరం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా యూరోప్ దేశాలు ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అబ్దెస్లామ్ బ్రసెల్స్‌లోని ఓ జైలులో ఉన్నాడు. బ్రసెల్స్‌లో దాడులకు సైతం కుట్ర పన్నినటు విచారణలో అబ్దెస్లామ్ అంగీకరించారు. అనుమానితుల ఫొటోల విడుదల విమానాశ్రయంలో దాడికి సంబంధించి ముగ్గురు అనుమానితుల సీసీటీవీ ఫోటోను పోలీసులు విడుదల చేశారు. వీరిలో ఎడమ చేతికి గ్లౌజ్‌లు తొడుక్కుని ఉన్న ఇద్దరిని మానవబాంబులుగా అనుమానిస్తున్నారు. గ్లౌజ్‌ల వెనుక ట్రిగ్గర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మరొకరు గడ్డంతో, కళ్లద్దాలు పెట్టుకుని, పెద్ద బ్లాక్ బ్యాగ్ ఉన్న ట్రాలీని తోసుకుంటూ వెళ్తున్నాడు. ఇతను బాంబును విమానాశ్రయంలో వదిలి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. పిరికిపందల పని బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ ► ‘ఈ దాడి పిరికిపందల చర్య. దుర్మార్గంగా ప్రజల ప్రాణాలను బలితీసుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం ఏకతాటిపైకి రావాలి’ అని బెల్జియం ప్రధాన మంత్రి చార్లెస్ మిచెల్ అన్నారు. వరుసపేలుళ్ల ఘటన, తదనంతర చర్యలను రిపోర్టు చేయకూడదంటూ బెల్జియన్ అధికారవర్గాలు మీడియాను కోరాయి. మీడియా రిపోర్టుల వల్ల విచారణకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఇలా కోరామని చెప్పాయి. ► మార్చి 30 నుంచి బ్రసెల్స్‌లో జరిగే ప్రధాని పర్యటలో మార్పులేదని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తెలిపారు. కాగా ఈ ఘటనలో భారతీయులెవరూ గాయపడలేదని ప్రభుత్వం తెలపగా.. తమ సిబ్బంది ఇద్దరికి గాయాలయ్యాయని జెట్ ఎయిర్వేస్ ప్రటించింది. ► బెల్జియం విమానాశ్రయంపై ఉగ్రదాడి దాడిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఉగ్రవాదు పిరికిపంద చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ► బ్రసెల్స్ ఘటనతో బెల్జియం సరిహద్దుదేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఫ్రాన్స్‌లో గతేడాది జరిగిన ఘటనకు ఉగ్ర లింకులు బెల్జియంలోనే బయటపడటంతో.. అదనంగా 1600 మంది భద్రతాబలగాలను సరిహద్దుకు తరలించింది. ► బెల్జియంపై దాడిని యురోపియన్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ‘అమాయకు లప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాదులు పిరికిపందలు’ అని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ అన్నారు. ► మంగళవారం నాటి ఉగ్రదాడి కేవలం బెల్జియంపై జరిగింది కాదని.. మొత్తం యూరప్‌పై దాడిగా దీన్ని పరిగణిస్తున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. ఉగ్రవాదులపై తమ పోరు కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ► ఉగ్రదాడితో షాక్‌కు గురైనట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. బెల్జియం కోలుకునేందుకు అన్ని రకాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ► బెల్జియం ఎయిర్‌పోర్టులో ఉగ్ర ఘటనతో.. భారత్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ బలగాలతో ప్రత్యేక భద్రత కల్పించారు. ► బ్రసెల్స్ విమానాశ్రయంలో తన భార్య, కుమారుడు చిక్కుకుపోయారని బాలీవుడ్ సింగర్ అభిజిత్ తెలిపారు. ఘటన జరిగే సమయానికి వారిద్దరూ న్యూయార్క్ వెళ్లాల్సిన జెట్‌ఎయిర్‌వేస్ విమానంలో ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణిలకులతోపాటు వీరిని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ► అమెరికా అధ్యక్ష ఎనికల రేసులో ముందజంలో ఉన్న డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లు కూడా బ్రసెల్స్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రసెల్స్ ఘటనలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా ఏకం అవ్వాలి. - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బ్రసెల్స్ ఘటన ఆందోళనకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. - ప్రధాన మంత్రి మోదీ జాతి, ప్రాంతం, మతాలకు అతీతంగా మనమంతా ఉగ్రవాదంపై పోరు జరపాలి. ప్రపంచ భద్రతకు ముప్పుగా పరిణమించిన వారిని అంతం చేయకతప్పదు. ఇందుకు అమెరికా తన శక్తిమేర సాయం చేస్తుంది. - అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా -
బ్రస్సెల్స్ లో బాంబులు పెట్టింది వీళ్లేనా!
- ముగ్గురు అనుమానితుల ఫొటోలను విడుదల చేసిన బెల్జియం పోలీసులు - మార్చి 30న బ్రసెల్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ/ బ్రస్సెల్స్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమిగా పేరుపొందిన నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) దళాలకు ప్రధాన స్థావరమైన బ్రసెల్స్(బెల్జియం) నగరంలో విధ్వంసం సృష్టించంచి ప్రపంచానికి పెను సవాలును విసిరింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ. నాటో ప్రధాన స్థావరంగానేకాక యురోపియన్ యూనియన్(ఈయూ) కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా ఉన్న బ్రసెల్స్ ను వ్యూహాత్మకంగానే టార్గెట్ గా చేసుకున్న ఐఎస్.. తన ప్లాన్ ను పక్కాగా అమలు చేసేందుకు సుశిక్షితులైన సభ్యుల్ని వినియోగించింది. ఎయిర్ పోర్టు సహా మెట్రో స్టేషన్ వద్ద బాంబులు అమర్చినట్లుగా అనుమానిస్తున్న ముగ్గురి ఫొటోలను బెల్జియం పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేశారు. నల్ల చొక్కాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు, వారి పక్కనే నడుస్తున్న మరో టోపీవాలాల కదిలికలను సీసీటీవీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు.. ఆ ముగ్గురే బాంబులు అమర్చినవారై ఉంటారని అనుమానిస్తున్నారు. సాధారణ ప్రయాణికుల మాదిరిగా ట్రాలీలో లగేజ్ ను నెట్టుకుంటూ వెళ్లిన వారు.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఎయిర్ పోర్టులోకి పేలుడు పదార్థాలను ఎలా తీసుకెళ్లారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే వీరి ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లతోపాటు పొరుగుదేశాలకు సైతం పంపిన బెల్జియం పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) బ్రసెల్స్ ఎయిర్ పోర్టు, మెట్రో స్టేషన్ల వద్ద చోటుచేసుకున్న మూడు పేలుళ్లలో 34 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. 30న బ్రసెల్స్ కు భారత ప్రధాని మోదీ ఇదిలా ఉండగా, ఈయూ- ఇండియా సదస్సులో పాల్గొనేందుకు మార్చి 30న భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రసెల్స్ వెళ్లనున్న నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్నపరిణామాలు అధికారులను కలవరపాటుకు గురిచేశాయి. అయితే బెల్జియం, ఈయూ ప్రతినిధులతో సంవాదాల అనంతరం మోదీ బ్రసెల్స్ పర్యటన యథావిథిగా కొనసాగుతుందని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. -
దాడుల భయంతో న్యూ ఇయర్ వేడుకలకు దూరం
-
దాడుల భయంతో న్యూ ఇయర్ వేడుకలకు దూరం
బ్రస్సెల్స్: ఉగ్రదాడుల భయాందోళనతో నూతన సంవత్సర వేడుకలకు బెల్జియం దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని బ్రస్సెల్స్ లోని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తుంటే ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉన్నందున తాము అ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బెల్జియం అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి, కొంత మంది అధికారులతో కలిసి సమావేశమైన అనంతరం ఈ నిర్ణయంపై స్పష్టత వచ్చిందని ఓ ఉన్నతాధికారి స్థానిక మీడియాకి వెల్లడించారు. అధికారికంగా ఈ వేడుకలు నిర్వహించనప్పటికీ, ప్రజలు మాత్రం సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. గురువారం రాత్రి న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేస్తున్నట్లు బ్రస్సెల్స్ మేయర్ వైవన్ మయేర్ తెలిపారు. నగరంలో ఇప్పటికీ పండుగ వాతావరణం ఉందని, ప్రజల సౌకర్యార్థం రెస్టారెంట్లు సహా సిటీ సెంటర్ అన్ని తెరచి ఉంటాయని ఆయన వివరించారు. అధికారులు న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న టెర్రర్ అటాక్ లెవల్-3 నుంచి కొత్త సంవత్సర వేడుకల నాటికి లెవల్-4కి చేరుకుంటుందని ఈ నెల 15న ఆ దేశ అంతర్గతవ్యవహారాల మంత్రిత్వశాఖ హెచ్చిరించింది. ఈ క్రమంలో ఉగ్రదాడులకు తావివ్వకూడదని భావించిన మంత్రులు, అధికారులు సెలబ్రెషన్స్ పక్కనపెట్టి భద్రతా, రక్షణ వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తూ గురువారం తమ నిర్ణయాన్ని ప్రకటించారు.