న్యూయార్క్: సూర్యుడి కంటే 9 రెట్లు పెద్దదైన భారీ కృష్ణబిలాన్ని(బ్లాక్ హోల్) బెల్జియం పరిశోధకులు గుర్తించారు. భూమికి కేవలం 1,60,000 కాంతి సంవత్సరాల దూరంలో మెగెలానిక్ క్లౌడ్ అనే నక్షత్ర మండలంలో ఇది నిద్రాణ స్థితిలో ఉన్నట్లు తేల్చారు. ఒక కాంతి సంవత్సరం అంటే 9,460,730,472,580.8 కిలోమీటర్లు. ‘బ్లాక్‌హోల్ పోలీసు’గా పిలిచే పరిశోధకుల బృందం దాదాపు 1,000 నక్షత్రాలను నిశితంగా పరిశోధించి, ఈ బ్లాక్‌హోల్‌ను కనిపెట్టింది.
మన భూగోళం ఉన్న పాలపుంత, నక్షత్ర మండలం వెలుపల బయటపడిన తొలి నిద్రాణ కృష్ణబిలం ఇదేనని చెబుతున్నారు. భారీ నక్షత్రాల జీవితకాలం ముగిసి, సొంత గురుత్వాకర్షణ శక్తిలోనే కూలిపోయినప్పుడు ఇలాంటి కృష్ణబిలాలు ఏర్పడుతుంటాయని పేర్కొంటున్నారు. నిద్రాణ స్థితిలోని బ్లాక్‌హోల్స్ నిస్తేజంగా ఉంటాయి. అంటే కాంతిని గానీ, రేడియేషన్‌ను గానీ వెలువరించవు. పరిసరాలతో ఎలాంటి సంబంధాలు ఉండని నిద్రాణ బ్లాక్‌హోల్స్‌ను గుర్తించడం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment