బ్రస్సెల్స్: ‘క్వారంటైన్ నియమాలు ఉల్లంఘించి ఓ సామాజిక కార్యక్రమానికి హాజరయ్యాను. క్షమించండి’ అంటూ బెల్జియన్ యువరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు.. బెల్జియం రాజు ఫిలిప్పి మేనల్లుడు ప్రిన్స్ జోచిమ్ (28) ఒక స్పానిష్ స్నేహితురాలి కుటుంబంలో జరిగిన సామాజిక కార్యక్రమానికి హాజరయినట్లు అధికారుల ప్రకటించారు. యువరాజు మే 24న బెల్జియం నుంచి స్పెయిన్ వెళ్లారు. మే 26న 12-27 మంది అతిథులు హాజరైన ఓసామాజిక సమావేశానికి వెళ్లినట్లు బెల్జియన్ ప్యాలెస్ ప్రెస్ ఆఫీస్ తెలిపింది. రెండు రోజుల తరువాత యువరాజుకు.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ సందర్భంగా జోచిమ్ ‘క్వారంటైన్ నియమాలు ఉల్లంఘించి వేరే ప్రాంతానికి ప్రయాణం చేశాను. ఈ క్లిష్ట సమయాల్లో నేను ఎవరినీ కించపరచాలని, అగౌరవపరచాలని అనుకోలేదు. నా చర్యల పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. పర్యవసానాలను అంగీకరిస్తాను’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. అయితే కొన్ని మినహాయింపులతో దేశానికి వచ్చే ప్రయాణికులు.. రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. సభలు సమావేశాలు వంటి వాటికి 15 మందికి పైగా హాజరుకాకుడదు. అయితే జోచిమ్ వెళ్లిన సామాజిక కార్యక్రమానికి 15 మందికి పైగా వచ్చినట్లు స్పానిష్ ప్రభుత్వ ప్రతినిధి రాఫేలా వాలెన్జులా సోమవారం మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమంలో 27 మంది వరకు ఉండవచ్చునని ప్రాంతీయ ఆరోగ్య అధికారులు స్పానిష్ ప్రభుత్వానికి తెలియజేశారన్నారు. (కరోనా: క్వారెంటైన్‌లోకి మరో ప్రధాని)
అయితే స్పెయిన్ అధికారుల వ్యాఖ్యలను ప్రిన్స్ లా ఆఫీస్ ప్రతినిధి ఖండించారు. ప్రిన్స్ ఒక స్నేహితురాలి కుటుంబంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారని తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి 15 మంది కంటే ఎక్కువ హాజరు కాలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం యువరాజు తేలికపాటి కరోనావైరస్ లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment