
కాల్పులు జరిగిన ప్రాంతం
లీజ్: బెల్జియంలోని లీజ్ సిటీలో ఓ దుండగుడు రెచ్చిపోయి ఓ పౌరుడితో పాటు ఇద్దరు పోలీసుల్ని హత్యచేశాడు. అనంతరం సమీపంలోని స్కూల్‌లో ఓ మహిళను బందీగా చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగుడ్ని మట్టుబెట్టారు. మంగళవారం ఉదయం లీజ్‌లో దుండగుడు విధుల్లో ఉన్న ఇద్దరు పోలీస్ అధికారుల్ని కత్తితో పలుమార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. వారివద్ద ఉన్న తుపాకులతో ఇద్దరు అధికారుల్ని కాల్చిచంపాడు. తుపాకులతో కొద్దిదూరం వెళ్లాక కారులో ఉన్న ఓ యువకుడిని కాల్చిచంపాడు.
Comments
Please login to add a commentAdd a comment