Nutella
-
హహ్హహ్హా.. ఈ బుడ్డోడికి ఎంత విశ్వాసమో..
నుటెల్లాను.. పీనట్ బటర్ అని చెబుతున్న ఓ బాలుడి వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. నుటెల్లా అంటూ స్పెల్లింగ్ కరెక్ట్‌గా చదువుతూనే చెబుతూనే పీనట్ బటర్ అంటూ నిస్సందేహంగా చెబుతున్న బాలుడి విశ్వాసం చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. షకీర్హా బోర్నె అనే ట్విటర్ యూజర్ ‘ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోతున్న. ఆ బాలుడికి ఎంత విశ్వాసం ఉంది’ అనే క్యాప్షన్‌తో బుధవారం ఈ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆ బాలుడు నుటెల్లా జార్‌పై ఉన్న స్పెల్లింగ్‌ను చదువుతున్నాడు. ఆ బాలుడి తండ్రి అదేంటి అని అడగ్గానే పీనట్ బటర్ అని గట్టి నమ్మకంతో సమాధానం ఇచ్చాడు. అయితే బాలుడు బాటిల్‌పై ఉన్న స్పెల్లింగ్ కరెక్టుగా చదివినప్పటికి పీనట్ బటర్ అంటూ కాన్ఫిడెంట్‌తో సమాధానం చెప్పిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ వీడియోకు ఇప్పటికి వరకు 4 మిలియన్ల వ్యూస్.. 3 లక్షలకు పైగా లైక్స్ రాగా వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. (చదవండి: వింత సంఘటన: దెయ్యం పనేనా!) ‘హ హ్హహ్హ.. ఆ బాలుడు నుటెల్లా చూసి పీనట్ బటర్ అని ఎంత నమ్మకంగా ఉన్నాడో’, ‘స్పెల్లింగ్ కరెక్టుగా చదివిన బాలుడు తప్పుగా సమాధానం ఇవ్వడంతో అతడి తండ్రి ఒక్కసారిగా షాక్ అయింటాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?..) -
ఎంత చెత్త వంటకం, యాక్!!
గులాబ్ జామున్ పావ్‌బాజీ, కుర్కురే మిల్క్ షేక్ వంటి వింతైన వంటకాల గురించి మీరు వినే ఉంటారు. తీపి వంటకాన్ని, మసాలా వంటకాన్ని మిక్స్ చేస్తే వచ్చిన సంకర జాతి వంటకాలు అవి. ఒకప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొట్టిన ఆ వంటకాలు నెటిజన్ల నుంచి భారీ అసహ్యాన్నే మూటగట్టుకున్నాయి. తాజాగా ఇలాంటి మరో వింతైన వంటకం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. అదే ‘‘న్యూటెల్లా బిర్యానీ’’. బిర్యానీని, న్యూటెల్లాను కలిపి తయారు చేసిన వంటకం ఇది. ప్రస్తుతం ఈ వింత వంటకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బిర్యానీ లవర్స్ దీనిపై మండిపడుతున్నారు. ( ఏంటిది.. చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్! ) ఈ వంటకంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ నేనిక ఈ భూమ్మీద ఉండలేను.. ఎంత చెత్త వంటకం, యాక్!!.. చెత్త ఐడియా, న్యూటెల్లాను ఎవరైనా బిర్యానీతో కలుపుతారా?.. ఈ వంటకాన్ని తయారు చేసినోడిని జైల్లో వేయాలి’’ అంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది తమదైన శైలిలో మీమ్స్ పెడుతూ రెచ్చిపోతున్నారు. చదవండి : లిఫ్ట్‌లో నరకం అనుభవించిన చిన్నారి -
బాత్‌టబ్‌లో.. సెన్సేషన్ వీడియో!
-
బాత్‌టబ్‌లో.. సెన్సేషన్ వీడియో!
చాక్లెట్లు అంటే చాలామంది పడిచస్తారు. కొందరు అస్తమానం చాక్లెట్లు నమలడానికి ఇష్టపడితే.. మరికొందరు బాటిళ్లకొద్దీ చాక్లెట్ రసాన్ని తాగే వీరాభిమానుల ఉంటారు. కానీ బ్రిటన్ చెందిన ఓ వ్యక్తి మాత్రం చాక్లెట్ల రసమైన న్యెటెల్లాపై తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. సిమ్రే కాండర్ అనే ఈ యువకుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం గతంలో అతను ఏకంగా 1250 బాటిళ్ల కారం సాస్‌ను తాగాడు. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈసారి మరి వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చాడు. విల్లీవాంక్లోని చాక్లెట్ సరస్సు, చాక్లెట్ ఫ్యాక్టరీలు మనకు తెలుసు. కానీ ఇతను ఏకంగా చాక్లెట్ బాత్‌టబ్ సృష్టించాడు. చాక్లెట్ రసం న్యుటెల్లాతో సాన్నపుకుండీని నింపి.. అందులో మునకవేశాడు. 'వావ్.. వావ్' అంటూ ఒంటినిండా చాక్లెట్ రసాన్ని పూసుకొని.. అందులో జలకాలాడాడు. కొంతసేపటికే ఆ రసం గట్టిగా, జిగటుగా మారిపోవడంతో మనోడికి కదలడమే కష్టమైంది. అయినా అతికష్టం మీద చాక్లెట్ బాత్‌టబ్‌లో మునిగితేలుతూ చిత్రవిచిత్రమైన స్టెప్టులు కూడా వేశాడు. దీంతో రాత్రికి రాత్రే సిమ్రే యూట్యూబ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఫేస్బుక్లో, యూట్యూబ్‌లో పెట్టిన అతని వీడియోను 30లక్షలమందికి పైగా వీక్షించారు.