నుటెల్లాను.. పీనట్ బటర్ అని చెబుతున్న ఓ బాలుడి వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. నుటెల్లా అంటూ స్పెల్లింగ్ కరెక్ట్‌గా చదువుతూనే చెబుతూనే పీనట్ బటర్ అంటూ నిస్సందేహంగా చెబుతున్న బాలుడి విశ్వాసం చూసి నెటిజన్‌లు మురిసిపోతున్నారు. షకీర్హా బోర్నె అనే ట్విటర్ యూజర్ ‘ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోతున్న. ఆ బాలుడికి ఎంత విశ్వాసం ఉంది’ అనే క్యాప్షన్‌తో బుధవారం ఈ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆ బాలుడు నుటెల్లా జార్‌పై ఉన్న స్పెల్లింగ్‌ను చదువుతున్నాడు. ఆ బాలుడి తండ్రి అదేంటి అని అడగ్గానే పీనట్ బటర్ అని గట్టి నమ్మకంతో సమాధానం ఇచ్చాడు.
అయితే బాలుడు బాటిల్‌పై ఉన్న స్పెల్లింగ్ కరెక్టుగా చదివినప్పటికి పీనట్ బటర్ అంటూ కాన్ఫిడెంట్‌తో సమాధానం చెప్పిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ వీడియోకు ఇప్పటికి వరకు 4 మిలియన్ల వ్యూస్.. 3 లక్షలకు పైగా లైక్స్ రాగా వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది.
(చదవండి: వింత సంఘటన: దెయ్యం పనేనా!)
‘హ హ్హహ్హ.. ఆ బాలుడు నుటెల్లా చూసి పీనట్ బటర్ అని ఎంత నమ్మకంగా ఉన్నాడో’, ‘స్పెల్లింగ్ కరెక్టుగా చదివిన బాలుడు తప్పుగా సమాధానం ఇవ్వడంతో అతడి తండ్రి ఒక్కసారిగా షాక్ అయింటాడు’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.
(చదవండి: ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?..)
Comments
Please login to add a commentAdd a comment