
అమెరికన్ యంగ్ సింగర్ ఆరోన్ కార్టర్(34) తన ఇంట్లోనే శవమై కనిపించడం కలకలం రేపుతోంది. కాలిఫోర్నియాలోని తన ఇంటి బాత్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో ఆరోన్ మృతదేమాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా 1987లో ఫ్లోరిడాలో జన్మించిన ఆరోన్ 7 ఏళ్ల ప్రాయంలోనే సింగర్‌గా స్టేజ్ షోలో పాల్గొన్నాడు.
తొమ్మిదేళ్లకే తొలి ఆల్భమ్‌ను రిలీజ్ చేశాడు. ఆరోన్స్ పార్టీ (కమ్ గెట్ ఇట్), ఐ వాంట్ కాండీ వంటి ఆల్భమ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆరోన్ సింగర్‌గానే కాకుండా నటుడిగా కూడా సత్తా చాటాడు. ఆరోన్ మృతిపై పలువురు సింగర్స్ సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
We are shocked and saddened about the sudden passing of Aaron Carter. Sending prayers to the Carter family. Rest in peace, Aaron ❤️ pic.twitter.com/rDUcE4i8Iy
— New Kids on the Block (@NKOTB) November 5, 2022