శాసనసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. సభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్భాషలాడారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా సోమవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.