
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను ఎగదోస్తున్న బాబు వ్యవహారం బయటపడింది. టీడీపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమావేశమైన ఆయన కేసులు పెట్టి పోలీసులను భయపెట్టండంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై ఐదారు కేసులు పెడితే.. వాళ్లే కాళ్ల బేరానికి వస్తారని చంద్రబాబు చెప్తున్న ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టెక్నాలజీని వాడుకుని ఆన్‌లైన్ ద్వారా కేసులు పెట్టాలని... టీడీపీ కార్యకర్తలను బాబు రెచ్చగొట్టారు.
(చదవండి: చంద్రబాబు వద్దకు జిల్లా టీడీపీ పంచాయితీ )
Comments
Please login to add a commentAdd a comment