provocative comments
-
స్థానిక నేతల స్క్రిప్టుతో రెచ్చిపోతున్న లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఘర్షణలకు ఆజ్యం పోస్తోంది. అధికార పక్షం నేతలపై వ్యక్తిగత విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు. సమృద్ధిగా కురిసిన వర్షాలకు పైరు పంటలతో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక్కసారిగా అలజడి రేపుతున్నారు. అందరూ కలసిమెలసి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న వేళ కలహాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, సమన్వయకర్తలను బూతులు తిడుతూ వారిపై టీడీపీ శ్రేణులను ఉసిగొల్పుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఐదు రోజుల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆరోపణలు నిరూపించాలంటూ ఎమ్మెల్యే దుద్దుకుంట సవాల్ విసిరారు. దీనికి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ప్రతిస్పందించారు. శనివారం తన అనుచరులతో పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి వద్దకు వెళ్లి వాహనంపైకి ఎక్కి తొడగొట్టారు. కవ్వింపు చర్యలకు దిగారు. తన అనుచరులను రెచ్చగొట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి శాంతియుతంగా చర్చించడానికి అక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ ‘పల్లె’ మాత్రం ఉద్రిక్తతలకు ఆజ్యం పోశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు నచ్చజెబుతున్నా వినకుండా ఆధ్యాతి్మక క్షేత్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయతి్నంచారు. కదిరి నుంచి ఇదే పంథా.. లోకేష్ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి రెచ్చగొట్టే ధోరణితోనే ముందుకు సాగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేను రెచ్చగొట్టడం, కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టడం, ఇరు వర్గాల వారూ కొట్టుకునేలా ప్రేరేపించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఆ తర్వాత పెనుకొండలో ఎమ్మెల్యే శంకరనారాయణపైనా అర్థపర్థం లేని ఆరోపణలు చేశారు. రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డిని కించపరుస్తూ మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న జిల్లాలో కక్షలు, కార్పణ్యాలకు లోకేష్ ఆజ్యం పోస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. స్థానిక నేతల స్క్రిప్టుతో.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో స్థానిక పరిస్థితులపై లోకేష్‌కు అవగాహన లేదు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు రాసిచ్చిన ఏకపక్ష స్క్రిప్టులు చదువుతూ పోతున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉంటే ఇదంతా చేసేవారు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాదయాత్రలో భాగంగా సభలు నిర్వహించడం, స్థానిక వైఎస్సార్సీపీ నేతలపై ఉన్నవీ లేనివీ కలి్పంచి ఆరోపణలు సంధించడం, అక్కడ గొడవలు సృష్టించడం.. వారం రోజులుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసినా ఎక్కడా రెచ్చగొట్టిన సందర్భాలు లేవని, ప్రభుత్వ వైఫల్యాల మీద మాత్రమే మాట్లాడేవారని, అప్పట్లో పాదయాత్ర హుందాగా జరిగిందని, జనం కూడా స్వచ్ఛందంగా, తరలివచ్చారని ప్రజలు గుర్తు చేస్తున్నారు. -
చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రోజురోజుకు చిత్రాచిత్రంగా, పట్టరాని అసహనంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. కృష్ణా జిల్లా గన్నవరంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన విషయాలు గమనిస్తే ఆయన ఏదో తేడాగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం సహజంగానే వస్తుంది. చంద్రబాబు అన్న మాటలు ఏమిటో చూడండి. దొంగాటలు వద్దు.. లగ్నం పెట్టుకుందాం రండి.. తాడోపేడో తేల్చుకుందాం.. ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా సైకోని కూడా తీసుకురండి.. అని అంటున్నారంటే ఏమని అనుకోవాలి. ఇది అసలు ఒక సీనియర్ నేత మాట్లాడవలసిన తీరేనా!పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి అర్దం, పర్దం లేకుండా ఆవేశపడడం ఒక ఎత్తు అయితే రండి.. కొట్టుకుందాం అని అంటున్నారంటే ఏమనాలి? ఆయనకు నిజంగా అంత భయం లేకపోతే తన చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోస్‌కు చెందిన వంద మంది భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు. ఆయన కూడా తనకు ఆస్థాయి భద్రత అవసరం లేదని, సాధారణ భద్రత సరిపోతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఆయనకు భద్రత వద్దనడం లేదు. కాని తానేమో పూర్తి భద్రత వలయంలో ఉండి, టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతున్న తీరు చాలా దారుణంగా ఉంది. గన్నవరంలో ఆయన పర్యటనలో స్థానికులు పెద్దగా పాల్గొనలేదట. ఆయనేదో నాలుగు డైలాగులు చెప్పి, యధా ప్రకారం ముఖ్యమంత్రిపైన, వైసీపీపైన దూషణలకు పాల్పడి నోటి తీట తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు. అన్ని చోట్ల పోలీసులను బెదిరించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం మద్దతుదారులుగా పోలీసులు మారకపోతే ఆయన ఊరుకోరట. ప్రభుత్వం వైపు ఉండకూడదట. నిజానికి గన్నవరం లో జరిగిన ఘటనలో పోలీసులు తమ బాధ్యత నిర్వహించకుండా ఉంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేది. అలా జరగలేదన్నదా చంద్రబాబు బాద అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తీవ్రమైన ఘటన జరిగి ఉంటే, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రచారం మరింతగా చేయవచ్చన్నదా ఆయన ఆలోచన అనిపిస్తుంది. ఒకవైపు టిడిపి కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వడం, వారిని దూషించడం అన్నిటికి చంద్రబాబే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన ఒక టార్గెట్ పెట్టుకుని టీడీపీ వారిని రెచ్చగొడుతున్నారు. మీరేమైనా చేయండి, కేసుల సంగతి మేం చూసుకుంటాం అని ఆయన గతంలోనే చెప్పారు. పోలీసులను ఏకంగా సంఘ విద్రోహ శక్తులంటూ ఇష్టారాజ్యంగా అనపర్తిలో, ఇతర చోట్ల మాట్లాడారు. తద్వారా తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులపైన దాడులు చేయాలని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. చుట్టూ భద్రతా వలయం ఉంది కనుక తన జోలికి రావాలంటే అంత ఈజీకాదని ఆయన భావన కావచ్చు. అందువల్ల ఆయన అందరిని రెచ్చగొట్టి తాను మాత్రం సేఫ్ గా ఉంటున్నారు. గత ఎన్నికల ముందు తనను సీబీఐ అరెస్టు చేస్తుందని, అందరు వచ్చి తన చుట్టూ ఉండాలని అంటుండేవారు. ఇప్పుడు ఏమో తేల్చుకుందాం రండి, లగ్నం పెట్టుకుందాం రండి అంటున్నారు. ఆ లగ్నానికి ఆయన పార్టీ నేత పట్టాభి వంటివారిని కూడా తీసుకువస్తారేమో తెలియదు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. పట్టాభి పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించి అరెస్టు అయిన తర్వాత మామూలుగా అయితే వెంటనే బెయిల్ పిటిషన్ వేసేవారు. అలాంటిది ప్రస్తుతం మాత్రం అంత తొందరేమీ లేదని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిద్వారా సానుభూతి సంపాదించాలన్నది టీడీపీ ప్లాన్ అట. అంటే తన దిక్కుమాలిన రాజకీయం కోసం తన పార్టీవారిని సైతం బలి చేయడానికి చంద్రబాబు వెనుకాడరా అని టీడీపీలోనే చర్చ జరుగుతోందట. వైఎస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకుగాను ఆయనను అయితే జైలులో పెట్టాలి.. లేదా పిచ్చాసుపత్రిలో చేర్చాలి అని అన్నారు. చంద్రబాబు లగ్నం పెట్టాలని అంటున్నారని అందుకు తాము సిద్దమేనని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను వదలిపెట్టి రావాలని నాని సూచించారు. మరి ఇందుకు చంద్రబాబు సిద్దపడతారా? ఇవేవి జరిగేవి కావు. కేవలం కార్యకర్తలను దాడులకు పురికొల్పడానికే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు కు బాలకృష్ణ పూనినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగానే బాలకృష్ణకు సినిమా డైలాగులు తప్ప రాజకీయ డైలాగులు చెప్పడం అంతగా చేతకాదు. ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన కోవలోకి చంద్రబాబు వచ్చారన్నది నాని అభిప్రాయం కావచ్చు. ఇక వివేకా హత్య కేసుపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఇన్నీ ,అన్నీ కావు.. వివేకా హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కదా! మరి అప్పుడు తన ప్రభుత్వంలోని పోలీసు అదికారులు విచారణ సరిగా చేయలేకపోయారని అది తమ ప్రభుత్వ అసమర్థత అని ఒప్పుకుంటున్నారా? ఎలాగొలా ముఖ్యమంత్రి జగన్‌పైన బురద పూయాలని నానా పాట్లు పడుతున్నారు. సిబిఐ తీరు కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది. అన్ని కోణాలలో ఎందుకు విచారణ చేయడం లేదో తెలియడం లేదని ఆ కేసును పరిశీలిస్తున్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జగన్ కేసులలో అచ్చంగా టిడిపి, కాంగ్రెస్ నేతలు సూచించిన విధంగా సీబిఐ డీల్ చేసిందని ప్రజలంతా నమ్మారు. సీబీఐ విచారణను జనం నమ్మలేదు కాబట్టే 2019లో ప్రజలంతా జగన్ కు పట్టం కట్టారు. ఇప్పుడు కూడా సిబీఐ అలాగే అతిగా ,ఏకపక్షంగా దర్యాప్తు చేస్తే రాజకీయంగా చంద్రబాబుకు ఉపయోగపడకపోగా, అది మరింత నష్టం చేసే అవకాశం ఉందని కొందరు ప్రముఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ది కార్యక్రమాల ఎజెండానుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబుతో పాటు, ఈనాడు, తదితర ఎల్లో మీడియా విపరీతంగా శ్రమిస్తోంది. అదికారంలోకి వస్తే తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేని దైన్య స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇతరత్రా జగన్ ను ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చా అని ఆలోచించి కుట్ర ప్లాన్ లను ముందుకు తీసుకు వస్తున్నది. ఇలాంటివి ఫలిస్తాయని అనుకోవడం భ్రమే అవుతుంది. ప్రజలంతా అమాయకులని భావిస్తే పప్పులో కాలేసినట్లే అవుతుందని చెప్పవచ్చు. -హితైషి చదవండి: హతవిధీ! ఇక్కడే ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో మన పరిస్థితి ఏంటి? -
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశాలకు గురికావొద్దు: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావొద్దని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ అన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించామని, ప్రజలందరూ సంయమనం పాటిస్తూ సహకరించాలన్నారు. చదవండి: మంగళగిరిలో సాక్షి రిపోర్టర్‌పై టీడీపీ గూండాల దాడి -
మరోసారి బయటపడ్డ చంద్రబాబు కుట్ర రాజకీయం
-
వీడియోలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను ఎగదోస్తున్న బాబు వ్యవహారం బయటపడింది. టీడీపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమావేశమైన ఆయన కేసులు పెట్టి పోలీసులను భయపెట్టండంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై ఐదారు కేసులు పెడితే.. వాళ్లే కాళ్ల బేరానికి వస్తారని చంద్రబాబు చెప్తున్న ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టెక్నాలజీని వాడుకుని ఆన్లైన్ ద్వారా కేసులు పెట్టాలని... టీడీపీ కార్యకర్తలను బాబు రెచ్చగొట్టారు. (చదవండి: చంద్రబాబు వద్దకు జిల్లా టీడీపీ పంచాయితీ ) -
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఇస్లాం ఖాన్
న్యూఢిల్లీ : తనపై నమోదైన దేశ ద్రోహ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ మైనార్టీ కమిషన్ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ల్యాప్‌టాప్, ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవద్దని కోరారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, తనను బెదిరించి బయపెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తాను ప్రభుత్వ ఉద్యోగిని అని, 72 సంవత్సరాల వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్ అనే కారణాలతో ఖాన్ ముందుస్తు బెయిల్ కోరారు. గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నట్లు అలాగే కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాని కేసు నుంచి తనకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్ తరఫు న్యాయవాదులు వ్రిందా గ్రోవర్, రత్న అప్పెండర్, సౌతిక్ బెనర్జీ పిటిషన్ దాఖలు చేశారు. (ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు) కాగా ఏప్రిల్ 28న జఫారుల్ ఇస్లాం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై దోశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఖాన్ వ్యాఖ్యలు మత భవాలను రెచ్చగొట్టే విధంగా, సమాజానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని వసంత్ కంజ్ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు సెక్షన్ 124 ఏ(దేశద్రోహం), సెక్షన్ 153ఏ (జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసులు నమోదు చేసింది. (జులై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు) -
ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు
ఢిల్లీ : ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్‌పై గురువారం దేశదేహ్రం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీస్ విభాగం పేర్కొంది. రెండురోజుల క్రితం జఫారుల్ ఇస్లాం సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై సెక్షన్ 124 ఏ( దేశద్రోహం), సెక్షన్ 153 ఏ( జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద కేసులు నమోదు చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. వసంత్ కంజ్ ప్రాంతానికి చెందిన నివాసితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఏప్రిల్ 28న సోషల్ మీడియా వేదికగా (ట్విటర్, ఫేస్బుక్) మతాలను రెచ్చగొట్టేలా జఫారుల్ వ్యాఖ్యలు ఉన్నాయని, మత సామరస్యానికి విఘాతం కలిగించేలా, సమాజంలో చీలికను తెచ్చేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఖాన్ ఆరోపించిన మత వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దేశాన్నిమోసం చేసి పారిపోయిన నేరస్థుడి పేరు ఖాన్ తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. భారత అధికారుల అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ఇప్పటికే ఆ నేరస్థుడి మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. అంతేగాక అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ), మనీలాండరింగ్, టెర్రర్ సంబంధిత కేసుల కింద బుక్ చేసింది. అలాంటి వ్యక్తిని జఫారుల్ ప్రశంసించడం దేశద్రోహం కిందే లెక్కగడతారని ఫిర్యాదులో ఉంది. అయితే దీనిపై జఫారుల్ స్పందిస్తూ... తనపై ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్తలు అవాస్తవమన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైందని తన దృష్టికి వచ్చేంతవరకు ఈ విషయాన్ని నమ్మనన్నారు. అయితే గురువారం ట్విటర్ వేదికగా నెటిజన్లను క్షమాపణలు కోరారు. ' నేను చేసిన ట్వీట్ కొంతమందికి బాధ కలిగించింది. కానీ తన వ్యాఖ్యలతో ఏ ఒక్కరిని కించపరిచాలనే ఉద్దేశం నాకు లేదు. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి' అంటూ జఫారుల్ ఇస్లాం ఖాన్ ట్వీట్ చేశారు. -
దీర్ఘకాల వాయిదా వద్దు
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లకు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. సంబంధిత పిటిషన్లను ఆరోతేదీన విచారించాలని ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. దీనికి ముందు.. ఢిల్లీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫిబ్రవరి 27న ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఏప్రిల్ 13 వరకూ వాయిదా వేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నమోదు కాగా సుప్రీంకోర్టు తాజాగా ఆరోతేదీనే విచారించాలంటూ హైకోర్టుకు సూచించింది. ద్వేషం, హింస అభివృద్ధికి ఆటంకాలు.. ద్వేషం, హింస దేశంలో జరిగే అభివృద్ధికి శత్రువులని, పెరిగిపోతున్న విభజనవాదం వల్ల భారతమాతకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో అల్లర్లు రేగిన ప్రాంతాలను కాంగ్రెస్ ప్రతినిధులు బుధవారం సందర్శించారు. అందులో ఓ బృందానికి నాయకుడిగా రాహుల్ పలు ప్రాంతాలకు వెళ్లారు. పాఠశాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి పీల్చుకుంటున్న ఢిల్లీ అల్లర్ల అనంతరం తీవ్ర ఆంక్షలతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు కొద్దికొద్దిగా బయటకు రావడం ప్రారంభించారు. ప్రభుత్వం పలు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అల్లర్ల ప్రభావిత ప్రాంతంలోని ప్రజలు ఆ సమయంలో తమ బంధువుల ఇళ్లకు వెళ్లగా, ఇప్పుడు తిరిగి వచ్చి తగలబడిపోయిన తమ ఇళ్ల నష్టాన్ని అంచనా వేసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అన్నీ పోలీసుల అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 436 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 1,427 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
యూట్యూబ్‌లో వీడియో.. వ్యక్తి అరెస్టు!
వడోదర : మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేరీతిలో ఓ వీడియోను తన యూట్యూబ్ పేజీలో పోస్టుచేసిన వ్యక్తిని వడోదర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి ఈద్ వేడుకలు, మహారాణా ప్రతాప్ జయంతి ర్యాలీ సందర్భంగా వడోదర నగరంలోని ఓల్డ్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మయూర్ కదం (30) వ్యక్తి తన యూట్యూబ్ పేజీ ‘ధరమ్ యోధ’లో ఓ వీడియోను పోస్టు చేశాడు. మహారాణా ప్రతాప్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలను పెట్టి.. ఈ వీడియోను రూపొందించాడు. ఈ వీడియో పోస్టు చేసిన ఒక్కరోజులోనే 2500 లైకులు వచ్చాయి. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉండటంతో సైబర్ సెల్ పోలీసులు ఈ వీడియోను ఒక్కరోజులోనే యూట్యూబ్లోంచి తొలగించారు. మయూర్ కదం తన నేరాన్ని ఒప్పుకున్నాడని, ప్రజలను వీడియో ద్వారా చైతన్యపరచాలని ఆ వీడియోను పోస్టుచేసినట్టు అంగీకరించడాని వడోదర జాయింట్ కమిషనర్ కేజీ భటీ తెలిపారు. నగరంలో ఏ చిన్న మతపరమైన ఉద్రిక్తత చోటుచేసుకున్నా.. మతఘర్షణలు రెచ్చగొట్టే ఉద్దేశంతో కొందరు దుండగులు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నారని, దీనిపట్ల అప్రమత్తంగా ఉంటూ.. ఈ చర్యలను నియంత్రిస్తున్నామని ఆయన తెలిపారు. మయూర్‌ను ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
స్వామి నోరు కట్టేశారా?
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి నోరును బీజేపీ కట్టేసిందా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఓ పక్క ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడమే కాకుండా దేశంలో అత్యున్నత పదవులు అలంకరించిన వారిని సొంత పార్టీల నేతలను సైతం ఆయన వదిలిపెట్టకుండా విమర్శలు కుప్పించారు. గత పార్లమెంటు సమావేశాల సమయంలో కీలక పాత్ర పోషించి ప్రతిపక్షాలను నోరు మెదపకుండా చేసిన సుబ్రహ్మణ్య స్వామి ఈసారి మాత్రం మిన్నకుండా పోయారు. కనీసం ఒక్కసారి కూడా ఆయన రాజ్యసభ చర్చలో కనిపించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంగానీ, గుజరాత్ దళితుల దాడి అంశంపై గానీ కాంగ్రెస్ పార్టీ అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడుతోంది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఏదో ఒక కొత్త అంశాన్ని ఆధారాలతో సహా బయటకు తెచ్చి ఇరకాటంలో పెట్టే సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి మాత్రం అలాంటి పనిచేయడం లేదు. అయితే, ఆయన గత రాత్రి మాత్రం ట్విట్టర్ లో చేసిన ఓ పోస్ట్ మాత్రం ఆయన నోరును బీజేపీ మూయించిందనే విషయాన్ని పరోక్షంగా చెబుతోంది. అందులో ఆయన ఏం చెప్పారంటే.. 'నేను మౌనంగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో దౌర్జన్యకాండ చేస్తోంది. నా మౌనానికి దీనికి సంబంధం ఉందా.. లేదా అలా జరిగిపోతుందా?' అంటూ ఆయన అందులో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్, అరవింద్ సుబ్రహ్మణియన్, శక్తికాంతా దాస్, ఆఖరికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సైతం సుబ్రహ్మణ్య స్వామి విమర్శించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా ఓ ఇంటర్వ్యూలో స్వామి మాటలను సమర్థించలేదు. స్వామి మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, పార్టీకి ఇబ్బందికలిగించే ప్రమాదం ఉందని కొందరు సీనియర్లు చెప్పిన నేపథ్యంలో ఆయనను నోరు మూపించినట్లు తెలుస్తోంది.