టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఘర్షణలకు ఆజ్యం పోస్తోంది. అధికార పక్షం నేతలపై వ్యక్తిగత విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు. సమృద్ధిగా కురిసిన వర్షాలకు పైరు పంటలతో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక్కసారిగా అలజడి రేపుతున్నారు. అందరూ కలసిమెలసి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న వేళ కలహాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, సమన్వయకర్తలను బూతులు తిడుతూ వారిపై టీడీపీ శ్రేణులను ఉసిగొల్పుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఐదు రోజుల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆరోపణలు నిరూపించాలంటూ ఎమ్మెల్యే దుద్దుకుంట సవాల్ విసిరారు. దీనికి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ప్రతిస్పందించారు. శనివారం తన అనుచరులతో పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి వద్దకు వెళ్లి వాహనంపైకి ఎక్కి తొడగొట్టారు. కవ్వింపు చర్యలకు దిగారు. తన అనుచరులను రెచ్చగొట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి శాంతియుతంగా చర్చించడానికి అక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ ‘పల్లె’ మాత్రం ఉద్రిక్తతలకు ఆజ్యం పోశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు నచ్చజెబుతున్నా వినకుండా ఆధ్యాతి్మక క్షేత్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయతి్నంచారు.
కదిరి నుంచి ఇదే పంథా..
లోకేష్ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి రెచ్చగొట్టే ధోరణితోనే ముందుకు సాగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేను రెచ్చగొట్టడం, కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టడం, ఇరు వర్గాల వారూ కొట్టుకునేలా ప్రేరేపించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఆ తర్వాత పెనుకొండలో ఎమ్మెల్యే శంకరనారాయణపైనా అర్థపర్థం లేని ఆరోపణలు చేశారు. రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డిని కించపరుస్తూ మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న జిల్లాలో కక్షలు, కార్పణ్యాలకు లోకేష్ ఆజ్యం పోస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
స్థానిక నేతల స్క్రిప్టుతో..
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో స్థానిక పరిస్థితులపై లోకేష్‌కు అవగాహన లేదు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు రాసిచ్చిన ఏకపక్ష స్క్రిప్టులు చదువుతూ పోతున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉంటే ఇదంతా చేసేవారు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాదయాత్రలో భాగంగా సభలు నిర్వహించడం, స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలపై ఉన్నవీ లేనివీ కలి్పంచి ఆరోపణలు సంధించడం, అక్కడ గొడవలు సృష్టించడం.. వారం రోజులుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసినా ఎక్కడా రెచ్చగొట్టిన సందర్భాలు లేవని, ప్రభుత్వ వైఫల్యాల మీద మాత్రమే మాట్లాడేవారని, అప్పట్లో పాదయాత్ర హుందాగా జరిగిందని, జనం కూడా స్వచ్ఛందంగా, తరలివచ్చారని ప్రజలు గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment