న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లకు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. సంబంధిత పిటిషన్లను ఆరోతేదీన విచారించాలని ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. దీనికి ముందు.. ఢిల్లీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫిబ్రవరి 27న ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఏప్రిల్ 13 వరకూ వాయిదా వేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నమోదు కాగా సుప్రీంకోర్టు తాజాగా ఆరోతేదీనే విచారించాలంటూ హైకోర్టుకు సూచించింది.
ద్వేషం, హింస అభివృద్ధికి ఆటంకాలు..
ద్వేషం, హింస దేశంలో జరిగే అభివృద్ధికి శత్రువులని, పెరిగిపోతున్న విభజనవాదం వల్ల భారతమాతకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో అల్లర్లు రేగిన ప్రాంతాలను కాంగ్రెస్ ప్రతినిధులు బుధవారం సందర్శించారు. అందులో ఓ బృందానికి నాయకుడిగా రాహుల్ పలు ప్రాంతాలకు వెళ్లారు. పాఠశాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఊపిరి పీల్చుకుంటున్న ఢిల్లీ
అల్లర్ల అనంతరం తీవ్ర ఆంక్షలతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు కొద్దికొద్దిగా బయటకు రావడం ప్రారంభించారు. ప్రభుత్వం పలు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అల్లర్ల ప్రభావిత ప్రాంతంలోని ప్రజలు ఆ సమయంలో తమ బంధువుల ఇళ్లకు వెళ్లగా, ఇప్పుడు తిరిగి వచ్చి తగలబడిపోయిన తమ ఇళ్ల నష్టాన్ని అంచనా వేసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అన్నీ పోలీసుల అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 436 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 1,427 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దీర్ఘకాల వాయిదా వద్దు
Published Thu, Mar 5 2020 4:41 AM | Last Updated on Thu, Mar 5 2020 4:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment