ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు చేసిన ఓవరాక్షన్‌కు ఓ రైతు బలయ్యాడు. కొండవీడు ఉత్సవాలకు సోమవారం సీఎం చంద్రబాబునాయుడు హాజరు కాగా.. వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు బలవంతగా కోటయ్య అనే రైతు పంట భూమిని లాక్కొన్నారు. సీఎం వాహనాల పార్కింగ్ కోసం పంటను ధ్వంసం చేశారు.