5 National Awards for AP Police Department Says DGP Damodar Goutam Sawang - Sakshi
Sakshi News home page

ఏపీ పోలీస్‌ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

Published Fri, Sep 3 2021 1:27 PM | Last Updated on Fri, Sep 3 2021 4:22 PM

5 National Awards for AP Police Department Says DGP Gautam sawang - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు అయిదు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ అయిదు అవార్డులు కూడా టెక్నాలజీ విభాగంలో వచ్చాయని వెల్లడించారు. ఈ రోజు ఏపీ పోలీసులు గర్వించదగ్గ రోజని పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఏపీ పోలీసు శాఖలోని సిబ్బంది ఆరోగ్య సమాచారమంతా పొందుపరచామని,  దీనికి కూడా అవార్డు దక్కిందన్నారు.

పాస్‌పోర్ట్‌ సేవలోనూ దేశంలోనే ఏపీ అగ్రస్ధానంలో ఉందని డీజీపీ తెలిపారు. పాస్‌పార్ట్‌ వెరిఫికేషన్ టెక్నాలజీ సాయంతో చేస్తున్న విధానం జాతీయ స్ధాయిలో మొదటి స్ధానంలో నిలబెట్టిందన్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 130 అవార్డులు ఏపీ పోలీస్ శాఖకి దక్కాయయని, ఈ అవార్డులు పోలీస్‌ శాఖపై మరింత బాద్యత పెంచాయని పేర్కొన్నారు. అవార్డులు పెరుగుతున్న కొద్దీ శాఖ పనితీరుని మరింతగా మెరుగుపరుచుకుంటున్నామన్నారు. కోవిడ్ సమయంలోఘేపీ పోలీస్ పనితీరు ప్రశంసలు  అందుకుందని చెప్పారు. 

‘దిశ యాప్, మహిళల రక్షణపై ఏపీ పోలీసు శాఖకి ఇప్పటివరకు 17 అవార్డులు వచ్చాయి. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందది. సీఎం వైఎస్ జగన్ దిశ యాప్ ప్రారంభించిన తర్వాత నుంచి రాష్ట్రంలో 46,66,841 మంది ఇప్పటి వరకు ఈ యాప్ డౌన్ లోడ్ చేశారు. దిశ యాప్‌తో మహిళలకి దైర్యం వచ్చింది. దిశ యాప్‌తో అన్ని విధాల రక్షణ లబిస్తుందని మహిళలు భావిస్తున్నారు. రోజుకి 4 వేల వరకు కాల్స్ వస్తున్నాయి. దిశ యాప్ ఒక్కదానికే గతంలో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. 

పోలీస్ సేవా యాప్‌ను ఇప్పటి వరకు 7 లక్షల పైన డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్నాం. పోలీస్ శాఖలో పారదర్శకతకి ఈ పోలీస్ సేవా యాప్ ద్వారా పెద్ద పీట వేస్తున్నాం.  ప్రతీ సోమవారం అన్ని‌జిల్లాల ఎస్పీ కార్యాలయాలలో స్పందన కార్యక్రమాన్ని‌ నిర్వహిస్తున్నాం. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి మహిళలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఏపీలో స్పందన కార్యక్రమం ద్వారా 38 వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం’ అని వెల్లడించారు.

చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement