
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు చేసిన ఓవరాక్షన్‌కు ఓ రైతు బలయ్యాడు. కొండవీడు ఉత్సవాలకు సోమవారం సీఎం చంద్రబాబునాయుడు హాజరు కాగా.. వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు బలవంతగా కోటయ్య అనే రైతు పంట భూమిని లాక్కొన్నారు. సీఎం వాహనాల పార్కింగ్ కోసం పంటను ధ్వంసం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను పోలీసులు ధ్వంసం చేయడంతో రైతు కోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కొద్దిసేపటికే కోటయ్య అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కొట్టడం వల్లే కోటయ్య మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కోటయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు అక్కడికి వెళ్లిన చిలకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త విడదల రజనీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.