సాక్షి,గుంటూరు:మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎదుగుదల ఇష్టం లేకనే ఆయనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని సురేష్ సతీమణి బేబి లత ఆరోపించారు. ఈ విషయమై ఆమె మంగళవారం(జనవరి14) మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి మా ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తిరిగారు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుంటే మరొక వ్యక్తి మా ఇంటి ఫోటోలు తీస్తున్నారు.
దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నందిగం సురేష్ అనుచరులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి నా భర్తను 134 రోజులు జైల్లో ఉంచారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు’అని బేబి లత ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గతంలో జైలులో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు.
సురేష్‌కు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఆయన సుదీర్ఘ కాలం పాటు జైలులోనే ఉండాల్సి వస్తోందని ఆయన భార్య బేబిలత పలు సందర్భాల్లో వాపోయారు. సురేష్ బెయిల్ విషయమై సుప్రీం కోర్టులో కూడా ఆమె పిటిషన్ వేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: కహానీలు చెబితే కడుపు నిండుతుందా..?
Comments
Please login to add a commentAdd a comment