
పలమనేరు: ఎన్నికల సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేసులున్నా లేకున్నా వైఎస్సార్‌సీపీ వాళ్లను బైండోవర్ల కేసులతో భయభ్రాంతులు గురి చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఒక ఆటోలో వస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు ఇది వైఎస్సార్ సీపీ వారిదనే అనుమానంతో నాలుగు కేసులు మద్యాన్ని సీజ్ చేశారు. అదే సమయంలో పట్టణంలోని పద్మశ్రీ సర్కిల్‌లోని మద్యం దుకాణాల నుంచి టీడీపీ నేతలు యథేచ్ఛగా మద్యాన్ని ఆటోల్లో తరలిస్తున్నా అటు వైపు పోలీసులు చూసి ఉంటే ఒట్టు! కొన్నాళ్లుగా పోలీసులు వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసిమరీ ఇబ్బందులు పెడుతున్నారని ఆ పార్టీ నాయకుల ఆరోపణ. పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఈ పరిస్థితి మరెలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు.