
సాక్షి, అమరావతి: గత కొద్ది రోజులుగా పోలీసు శాఖపై వస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ బుధవారం స్పందించింది. 14 నెలల్లో 24 జాతీయ స్థాయి అవార్డులు సాధించిన పోలీసు శాఖపై విమర్శలు భావ్యం కాదని పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై విమర్శలు మానుకోవాలని హితవు పలికింది. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, చంద్రగిరిలో నమోదైన కేసులపై వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరిలో అరెస్ట్ అయిన రాజేష్ చౌదరిపై పలు పోలీస్ స్టేషన్‌లో కేసులున్నాయని తెలిపింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉత్తమ పోలీస్ సేవలందిస్తున్నామని తెలిపింది. 14 నెలలుగా రాష్ట్ర ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నామని వ్యాఖ్యానించింది. (అందరికీ రుణపడి ఉంటాం: డీజీపీ)