సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు గురువారం కలిశారు.
ఇప్పటివరకు మదాసి కురువ, మదారి కురువ కులాలకు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆర్డీవో పరిధి నుంచి ఎమ్మార్వో పరిధిలోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేసిన కురువ సంఘాల ప్రతినిధులు.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కురువ సాంప్రదాయం ప్రకారం కంబలి కప్పి ముఖ్యమంత్రిని సన్మానించారు. తమ కులస్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళడంతో సీఎం సానుకూలంగా స్పందించారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ప్రెస్‌అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని
Comments
Please login to add a commentAdd a comment