
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని అమిత్ షాకు ఎంపీ గోరంట్ల విన్నవించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఛీత్కరించినా చంద్రబాబు తీరు మారలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక గొడవ సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు,టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని అమిత్‌షాను కోరామని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment