సాక్షి, అనంతపురం: కిసాన్ రైల్లో తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిసాన్ రైలుతో రైతులకు మార్కెటింగ్ సౌకర్యం పెరిగిందన్నారు. పండ్ల తోటల రైతులు దీన్ని సమృద్ధిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: కిసాన్ రైలు రవాణాపై 50 శాతం చార్జీల తగ్గింపు)
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషివల్లే అనంతపురానికి కృష్ణా జలాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ నీటితోనే రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. (చదవండి: ‘అనంత’ ఫలసాయం హస్తినకు..)
Comments
Please login to add a commentAdd a comment