Kisan Rail
-
‘కిసాన్ రైలు’ వస్తోంది!
జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల మామిడికి మంచి రంగు, రుచి, వాసనతో పాటు నాణ్యత ఉండటం తో వీటికి ఉత్తర భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, జమ్ము, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తుంటారు. ఇప్ప టివరకు లారీల్లో మామిడిని తరలించిన వ్యాపారులు, ప్రస్తుతం కిసాన్ రైలు ద్వారా రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సోమవారం కిసాన్ రైలు జగిత్యాల–లింగంపేట రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకోనుంది. మామిడికాయలు వ్యాగన్లలో లోడ్ కాగానే రాత్రి 11 గంట లకు రైలు ఢిల్లీ బయలుదేరుతుంది. సీజన్ ముగిసే వరకు.. మామిడి సీజన్ ముగిసే వరకు జగిత్యాల నుంచి ఢిల్లీకి కిసాన్‌రైలును నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం సోమవారం 20 వ్యాగన్లలో 460 టన్నుల మామిడికాయలను తరలించనున్నారు. 14న, 19న మళ్లీ కిసాన్ రైలు మామిడి కాయలతో జగిత్యాల నుంచి ఢిల్లీ వెళ్లనుంది. ఇలా సీజన్ ముగిసే వరకు నడిపనున్నారు. ఈ రైలును ఉపయోగించుకుంటే 50% సబ్సిడీ ఇస్తారు. కాగా, కిసాన్‌రైలు ద్వారా రైతులకు, వ్యాపారులకు మేలు జరుగుతుందని రైల్వే అడ్మినిస్ట్రేటివ్ అధికారి సుభమ్జైన్ అన్నారు. ఎంతవరకు అవసరమైతే ఆ మేరకు కిసాన్ రైళ్లను నడిపిస్తామని చెప్పారు. జగిత్యాలలో కొనుగోలు చేసిన మామిడికాయలను ఎక్కువగా ఢిల్లీ పంపిస్తాం. అయితే, డీజిల్ ధర పెరగడంతో రవాణా భారం ఎక్కువైంది. ఈ సమయంలో కిసాన్‌రైలును ఉపయోగించుకుంటున్నాం. దీని ద్వారా రవాణా ఖర్చు తక్కువ అవడమేకాక ఒక్క రోజులోనే ఢిల్లీకి చేరుతుంది. దీని ఫలితంగా రైతులకు సైతం కొంత రేటు పెరిగే అవకాశం ఉంటుంది. – సాధిక్, మామిడి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి, జగిత్యాల -
పండ్ల తోటల రైతులు దీన్ని ఉపయోగించుకోవాలి
సాక్షి, అనంతపురం: కిసాన్ రైల్లో తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిసాన్ రైలుతో రైతులకు మార్కెటింగ్ సౌకర్యం పెరిగిందన్నారు. పండ్ల తోటల రైతులు దీన్ని సమృద్ధిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: కిసాన్ రైలు రవాణాపై 50 శాతం చార్జీల తగ్గింపు) ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషివల్లే అనంతపురానికి కృష్ణా జలాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ నీటితోనే రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. (చదవండి: ‘అనంత’ ఫలసాయం హస్తినకు..) -
రైతు కల సాకారం
-
‘కిసాన్ రైలు’
-
ప్రారంభమైన ‘కిసాన్ రైలు’
సాక్షి, అనంతపురం : ‘అనంత’ రైతన్న ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఉద్యాన హబ్’ కల సాకారమైంది. జిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బుధవారం ఢిల్లీకి ప్రత్యేకంగా ‘కిసాన్ రైలు’ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ సి.అంగడి జూమ్ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతపురం రైల్వే స్టేషన్నుంచి ఈ రైలు బయలుదేరింది. మహారాష్ట్ర తర్వాత ఇది రెండో ‘కిసాన్ రైలు’ కావడం గమనార్హం. అక్టోబర్ నుంచి రైలును పూర్తిస్థాయిలో నడిపేలా చర్యలు చేపట్టనున్నారు. చదవండి : చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ -
‘అనంత’ ఫలసాయం హస్తినకు..
సాక్షి, అనంతపురం అగ్రికల్చర్: ‘అనంత’ రైతన్న ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఉద్యాన హబ్’ కల సాకారమవుతోంది. జిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఢిల్లీకి నేడు ప్రత్యేకంగా ’కిసాన్ రైలు’ ప్రారంభం కానుంది. మహారాష్ట్ర తర్వాత ఇది రెండో ‘కిసాన్ రైలు’ కావడం గమనార్హం. అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బుధవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరే కిసాన్ రైలును సీఎం వైఎస్ జగన్, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ సి.అంగడి జూమ్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్టోబర్ నుంచి రైలును పూర్తిస్థాయిలో నడిపేలా చర్యలు చేపట్టారు. ►కిసాన్‌రైలు తొలి సర్వీసులో 400 టన్నుల టమాటా, చీనీ, బత్తాయి, కర్భూజా, బొప్పాయి, అరటి ఉత్పత్తులను తరలించేందుకు 14 వ్యాగన్లు, ఒక స్లీపర్ కోచ్ బోగీ సిద్ధం చేశారు. రైతులు, వ్యాపారులతోపాటు అధికారుల బృందం కూడా కిసాన్ రైలులో ఢిల్లీ వెళ్లనుంది. ►అనంతపురం నుంచి ఢిల్లీలోని అజాద్‌పూర్ మార్కెట్‌కు ఉద్యాన ఉత్పత్తులను తరలించి విక్రయించుకునేందుకు దేశ రాజధానిలో తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ►కిసాన్ రైలు సదుపాయం వల్ల ఏటా 55 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను తరలించడం ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా టర్నోవర్ జరిగే అవకాశం ఉందని, ’అనంత’ రైతులకు అదనంగా 20 నుంచి 30 శాతం మేర ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి 36 గంటల వ్యవధిలో చేరుకునే కిసాన్ రైలు ద్వారా పండ్ల ఉత్పత్తులకు మంచి ధర లభించే అవకాశం ఉంది. వీటికి బీమా సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతానికి టన్ను రవాణా ఖర్చు రూ.5,135 చొప్పున నిర్ణయించినా రైతులకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఏపీఎంఐపీ పీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ పి.పద్మలత తెలిపారు. ఏర్పాట్లను ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ చంద్రుడు పరిశీలించారు. (12 నుంచి 24 ప్రత్యేక రైళ్లు)