సాక్షి, అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిరాశ, నిస్పృహలతో సొంత పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపై కాదు.. హిందూపురం ప్రజలపై దాడి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. పంచరైన సైకిల్‌ను చంద్రబాబు వయోభారంతో తొక్కుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా.. ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటాడోనని అభిమానులు, నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఆయన పక్కన నిల్చోవాలన్నా వణికిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిదెబ్బ రుచి చూసిన, బూతులు తిట్టించుకున్న వాళ్లు కోకొల్లలు. తాజాగా ఓ అభిమాన ఫొటోగ్రాఫర్ ఉత్సాహంతో ఫొటో తీయడంతో బాలయ్య అతని చెంప ఛెళ్లుమనిపించిన సంగతి విధితమే
ఇది ఇలా ఉండగా, గత గురువారం కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. టీడీపీ నాయకులపైనే తన దుడుకుతనాన్ని ప్రదర్శించారు. సుగూరు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా... ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు ఫక్కున నవ్వారు. దీనిపై బాలయ్య సీరియస్ అయిన సంగతి తెలిసిందే..
చదవండి:
మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
Comments
Please login to add a commentAdd a comment