
సాక్షి, అనంతపురం : ఎన్నికల వేళ టీడీపీ ప్రలోభాలకు తెరతీస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు డబ్బు కట్టలతో అడ్డంగా దొరకుతున్నారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాప్తాడులోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోనే తిష్టవేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు తాయిలాలు ఇచ్చేందుకు అక్కడే కూర్చుని ఉన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిటాల వర్గీయులు హడావిడి చేస్తున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రం వద్ద ఉండకుండా పోలీసులు పంపేస్తున్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం..
రాప్తాడు పోస్టల్ బ్యాలెట్స్ కేంద్రం వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఒకే ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటుపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతపురం అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరారు. అరకొర ఏర్పాట్లపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నా సూరీ వర్గీయులు
ధర్మవరం టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరీ వర్గీయులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సూరీ వర్గీయులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యే వరదాపురం తనయుడు నితిన్‌సాయి తన అనుచరులతో వీరంగం సృష్టించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులను బెదిరిస్తున్నారు. వాటిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తూ.. చోద్యం చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment