
పరిటాల సునీత, శ్రీరామ్‌తో కలసి పాదయాత్రలో పాల్గొన్న రామాంజినమ్మ ( వృత్తాకారంలో)
సాక్షి, అనంతపురం(ఆత్మకూరు): ఓ ప్రభుత్వ ఉద్యోగి గీత దాటారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఓ రాజకీయ పార్టీ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ హల్‌చల్ చేశారు. ఆమె వ్యవహార శైలి చూసి అక్కడున్న వారంతా ముక్కునవేలేసుకున్నారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మ మదిగుబ్బ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తోంది. గురువారం ఆత్మకూరు మండలం సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా సాగిన పరిటాల సునీత పాదయాత్రలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రామాంజినమ్మ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తగా పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఎంపీడీఓ కొండన్న, స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులను వివరణ కోరగా.. విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment