రాప్తాడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే గత నాలుగున్నరేళ్లుగా మంత్రి పరిటాల సునీత సొంత గ్రామమైన రామగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. మంత్రి సునీత ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను కూడా రామగిరి మండలంలోనికి అనుమతించలేదు. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి రామగిరి మండలం ఎన్నికల ప్రచారానికి పోలీసులు అనుమతిచ్చారు.