అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ పేరుతో తమను మోసం చేశారంటూ తోపుదుర్తిలో డ్వాక్రా మహిళలు మంత్రి పరిటాల సునీతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు కర్కషంగా అరెస్టు చేశారు. డ్వాక్రా మహిళలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారు.