
సాక్షి, అనంతపురం: జిల్లాలో డ్వాక్రా మహిళలపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. స్వయంగా మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళీ మహిళలపై రాళ్లు రువ్వాడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి సోదరుడు మురళీ రెచ్చిపోయాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తామని ప్రమాణం చేయాల్సిందిగా పరిటాల వర్గీయులు అడుగగా.. అందుకు డ్వాక్రా మహిళలు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి పరిటాల సునీత వర్గీయులు దాడులకు దిగారు. పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంత్రి సోదరుడు మురళీ, పరిటాల అనుచరుల దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment