
సాక్షి, అనంతపురం : జిల్లాలోని రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో నిర్వహించిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు ప్రమాణం చేయాలని జారీ చేసిన హుకుంను నిరాకరించిన డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం, సోదరుడు మురళీ సమక్షంలోనే ఈ దాడులు జరిగాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయాలంటూ ప్రమాణం చేయించుకోవడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు పాలభిషేకం, టీడీపీకి ఓటు వేయాలని ప్రమాణం చేస్తేనే చెక్కులు ఇస్తున్నారు మహిళలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment