
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత కుటుంబంలో ఎమ్మెల్యే టికెట్ చిచ్చురేపింది. వివరాల్లోకి వెళ్తే.. పరిటాల కుటుంబం రాప్తాడు, కల్యాణదుర్గం టికెట్లను తమకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఖరారు చేశారు. రాప్తాడు టికెట్‌ను మరోసారి పరిటాల సునీతకు కేటాయించారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆసక్తి కనబరిచారు. దీంతో రాప్తాడు నుంచి శ్రీరామ్‌ను బరిలో నిలిపేందుకు సునీత సిద్దమయ్యారు.
తాము రెండు స్థానాలు కోరినప్పటికీ చంద్రబాబు ఒకటే సీటు కేటాయించడంతో.. సునీత పోటీ నుంచి తప్పుకున్నారు. శ్రీరామ్‌ను గెలిపించాల్సిందిగా ఆమె పార్టీ శ్రేణులను కోరారు. కాగా, రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీపై సునీత కుటుంబంలో అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్ పోటీని కుటుంబంలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment