సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరించని వారిని మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ టార్గెట్ చేశారు. మంత్రి అండతో చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో పరిటాల వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ రోజున వైఎస్సార్ సీపీకి ఎందుకు ఓట్లు వేశారంటూ రాడ్లు, కర్రలతో దాడి చేశారు.ఈ సంఘటనలో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడులు చేసిన వారిలో ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే దాడికి పాల్పడ్డ పరిటాల వర్గీయులను వదిలివేయాలంటూ మంత్రి పరిటాల సునీత... ఎస్‌ఐ రఫీకి ఫోన్ కాల్ చేశారు. మంత్రి ఆదేశాలతో దాడి చేసినవారిని ఎస్‌ఐ వదిలివేయడంతో పాటు, పోలీసులు ఓ వర్గంవారికే వత్తాసు పలుకుతున్నారంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఆదేశాలతోనే దాడులు చేశామని నిందితులు చెబుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎన్‌ఎస్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment