సాక్షి, అనంతపురం(రాప్తాడు): నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు మరికొందరిపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ బి.రాఘవరెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు.
అయితే రాప్తాడు మండల టీడీపీ కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మల్లికార్జున తదితరులతో కలిసి సునీత, శ్రీరామ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు బుధవారం జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రచార వాహనంపై నుంచి సునీత, శ్రీరామ్, సర్పంచ్ సాకే తిరుపాలు, పంపు కొండప్ప, సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ప్రసంగాలు చేశారని, 30 యాక్ట్ ఉల్లంఘన కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment