జనాన్ని చూసి బేజారు.. పరిటాల వర్గీయుల దాడి..! | Paritala Sunitha Supporters Attacks On YSRCP Leader Thopudurthi Prakash Reddy Convoy | Sakshi

టీడీపీ గూండాల దాడి...చోద్యం చూసిన పోలీసులు..!

Published Sun, Apr 7 2019 8:43 PM | Last Updated on Sun, Apr 7 2019 8:53 PM

Paritala Sunitha Supporters Attacks On YSRCP Leader Thopudurthi Prakash Reddy Convoy - Sakshi

ఐదేళ్లుగా రామగిరి మండలంలో పర్యటించేందుకు పోలీసులు..

అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి మంత్రి పరిటాల సునీత జీర్ణించుకోలేక పోతున్నారు. రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆమె సొంత మండలమైన రామగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుతుర్తి ప్రకాష్‌రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించగా..అక్కడి ప్రజలు భారీ ఎత్తున మద్దతు పలికారు. దీంతో ఆమె వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. ముత్యాలంపల్లి వద్ద ప్రకాష్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఇంత జరగుతున్నా అక్కడున్న పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప టీడీపీ గూండాలను అడ్డుకునే యత్నం చేయలేదు. ఈ క్రమంలో డీఎస్పీ వెంకటరమణకి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

రాప్తాడులో సునీత దౌర్జన్యాలపై ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని, గత 25 ఏళ్లుగా పదవుల్లో ఉన్నా రామగిరి ప్రజల సమస్యలను పరిటాల కుటుంబం తీర్చలేకపోయిందని అన్నారు. ఐదేళ్లుగా రామగిరి మండలంలో పర్యటించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ఇదంతా మంత్రి కుట్రేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రామగిరి, కొత్తపల్లి, నసనకోట, పేరూరు గ్రామాల్లో ప్రకాష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement