
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. రామగిరి వైఎస్సార్‌సీపీ నేత బోయ సూర్యంపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వేటకొడవళ్లతో సూర్యంపై దాడి చేశారు. పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో ఈ ఘటన జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలు అయ్యాయి. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ డాడి చేయించారని బాధితులు ఆరోపించారు. గాయపడిన వారిని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు పరామార్శించారు.